Rahul gas success

rahul demand, aicc meetings, central minister veerappa moily, bjp comments on gas cylindars, bjp fire on congress decession

rahul demanding another subsidy gas cylindars

రాహుల్ గ్యాస్ విజయం

Posted: 01/18/2014 08:33 AM IST
Rahul gas success

వంట గ్యాస్ రాయితీ సిలిండర్ల కేటాయింపు సంఖ్య పెంపు విషయంలో రాహుల్ విజయం సాధించారు. ఇంతవరకూ ఇస్తున్న సబ్సిడీ సిలిండర్లు సామాన్యులకు ఏమాత్రం సరిపోవడంలేదని వీటి సంఖ్యను మరింత పెంచాలని రాహుల్ గాంధీ సూచించిన మేరకు కేంద్రమంత్రి వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతోరాయితీ సిలిండర్ల సంఖ్య 9 నుండి 12కు పెరిగింది.

దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ అధికారిక ప్రకటన కూడా చేశారు. ఎఐసిసి సమావేశంలో రాహుల్ కోరిన వెంటనే మంత్రి దీనికి అనుమతి నివ్వడం విశేషం. అయితే దీనిపై బిజెపి మండి పడింది. రాహుల్ ఇలాకోరగానే కేంద్రమంత్రి అలా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని తప్పుపట్టింది. ఇదంతా కాంగ్రస్ ఎన్నికల కోసం ఆడుతున్న నాటకమని విమర్శించింది.

ఏదిఏమై నప్పటికి రాహుల్ కోరగానే ఈ విధంగా స్పందన వచ్చి రాయితీ సిలిండర్లను పెంచడాన్ని వినియోగ దారులు హర్షిస్తున్నారు. ఇన్నాళ్లూ గ్యాస్ సిలిండర్లు చాలక అనేక ఇబ్బందులు పడ్డామని ఇక తమ గ్యాస్ కష్టాలు తీరిపోనున్నాయని వారు సంబరపడిపోతున్నారు. అయితే కాంగ్రెస్ ఎన్నికల్లో తమను ధీటుగా ఎదుర్కోలెకనే ఇటువంటి జిమ్మిక్కులు చేస్తోందని బిజెపి ఎద్దేవా చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles