Aap is another congress party

AAP, RAJNATHSINGH,BJP MEETING, CONGRESS PARTY, MODI, RAHUL GANHI, BJP DECESSIONS, BJP ELECTION CAMPAIN, BJP FIRE ON AAP, BJP VS CONGRESS

AAP IS ANOTHER CONGRESS PARTY SAYS RAJNATH SINGH

ఆప్ కు మరో పేరు కాంగ్రెస్

Posted: 01/18/2014 08:20 AM IST
Aap is another congress party

బిజెపిపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోఫణలకు బాజాపా అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమను అడ్డుకునేందుకు  కాంగ్రెస్ శతవిధాలా ప్రయ్నత్నిస్తోందన్నారు.  దీనికి వంతపాడుతున్న ఆఫ్ తీరునూ ఆయన దుయ్యబట్టారు. ఆప్ కాంగ్రస్ కు ప్రతిరూపమన్నారు. ఢిల్లీలో ఆప్ సర్కారు కాంగ్రెస్ కు అన్ని విధాలా సహకరిస్తోందని,  అది దాని తోక పార్టీఅని  విమర్శించారు.

రాబోయే ఎన్నికల్లో భాజాపా పాలిత ప్రాంతాల్లో జరిగిన అభివ్రుద్ధిని అందరికి తెలియ జేయాలని బిజెపి నాయకలను కోరారు. ఇక ప్రధాని అభ్యర్థి అంశాన్ని ప్రస్తావిస్తూ తమ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి ధీటుగా కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ ఎంతమా్త్రం సరితూగడన్నారు. మోడీని ఎదుర్కొనే ధైర్యం కాంగ్రెసకు  ఎంతమాత్రం లేదని అందుకు ప్రధాని అభ్యర్థిని ప్రకటించడంలోత టపటాయిస్తున్నారని విమర్శించారు.

మతరాజకీయాలను  తాము వ్యతిరేకిస్తామని  కాంగ్రెస్ అధినేత్రి సోనియా అనడాన్ని భాజాపా సీనియర్ నాయకుడు మురళీమనోహర్ జోషి తీవ్రంగా ఖండించారు. ఓట్ల రాజకీయాల కోసం కాంగ్రెస్ అనేక మార్లు మత రాజకీయాలను పాల్పడిందని గుర్తు చేశారు. 1984లో ఢిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోతలో కాంగ్రెస్ భాగస్వామ్యం  ఉందన్నారు.

రాబోయే ఎన్నికల సందర్భంగా ఓటరు నాడిన జాగ్రత్తగా పట్టుకోవాలని బిజెపి నేతలకు సూచించారు. అలాగే ఈ సారి జరిగే ఎన్నికలు ఎంతో కీలకమైనవని ఓటరు అభ్యర్థుల గుణగణాలను పరిశీలిస్తుంటాడన్నారు.  లోక్ సభ ఎన్నికల్లో  మోడీ గుజరాత్ నుండి పోటీచేయాలా  లేక వేరే రాష్ర్టం నుండి పోటీ చేస్తారా అనేది పార్టీ అధిష్టానం చూసుకుంటందన్నారు. 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles