Tt back cases on devotees

kanumuri bapiraju, TTD, devotees, TTD, ttd cases on devotees, mukkoti ekadasi, tirumala, kanumuri bapi raju, ttd EO

TT back cases on devotees, kanumuri bapiraju, TTD, devotees, TTD, ttd cases on devotees, mukkoti ekadasi, tirumala

నిజం ఒప్పుకున్న టటీడీ ఛైర్మెన్

Posted: 01/16/2014 05:16 PM IST
Tt back cases on devotees

కలియుగ దైవం అయిన తిరుమల తిరుపతి దేవస్థానం కొండను పవిత్రంగా ఉంచి, సామాన్య భక్తులకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా చూడాల్సిన టీడీడీ పాలక మండలి ఛైర్మెన్, అధికారులు సామన్య భక్తులను గాలికి వదిలేసి, వీఐపీలకు, కరుడుగట్టిన ఉగ్రవాదులకు, మాఫియా గ్యాంగ్ కి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తున్నారని టీడీపీ నేత గాలి ముద్దు ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించిన విషయం తెలిసిందే.

ఇటీవలి కాలంలో దర్శనం విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సామన్య భక్తులు అధికారుల పై ఎదురు తిరిగినందుకు భక్తుల పైనే కేసులు బనాయించిన టీటీడీ బోర్డు ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు కనుమూరి బాపిరాజు. భక్తుల పై కేసులు ఉపసంహరించుకుంటున్నామని, తిరుమల కొండకు వచ్చే భక్తులు ధర్మాన్ని పాటించాలని బాపిరాజు కోరారు. దర్శన విషయంలో సామాన్య భక్తులకు కలిగిన అసౌర్యానికి చింతిస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూసుకుంటామని మీడియా సమావేశంలో తెలిపారు.

ఇక గాలి ముద్దు ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించిన వ్యాఖ్యల పై స్పందిస్తూ... మాఫియా డాన్ దావూద్ అనుచరులకు దర్శనం కల్పించిన మాట వాస్తవమేనని, అయితే వారు దావూద్ అనుచరులను తమకు తెలియదని, మహరాష్ట్ర మంత్రితో వచ్చారు కాబట్టి వారికి ప్రోటోకాల్ ప్రకారం దర్శనం కల్పించామన్నారు. ఈయన మాటలను బట్టి చూస్తుంటే మహారాష్ట్ర మంత్రికి దావూద్ గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నాయా ? ఈ గ్యాంగ్ ఆ మంత్రి వెంట వస్తే సకల సపర్యలు చేయడం ఏంటి ? ఈ విషయం ఇప్పుడు మరింత రాజుకునే అవకాశం ఉంది. ఏమైనా కనుమూరి నిజం ఒప్పుకున్నాడని సామాన్య భక్తులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles