Assembly war on telangana issue

assembly, telangana issue, Andhra Pradesh Assembly,be voting on the Bill, debate on the draft Telangana Bill

assembly war on telangana issue

నేటి నుండి విభజన అసెంబ్లీ

Posted: 01/17/2014 07:43 AM IST
Assembly war on telangana issue

పండుగ సెలువలు ముగిశాయి. మళ్లీ నేటి నుండి అసెంబ్లీ వేడి మొదలు కానుంది. రాష్ర్ట పునర్వభజన అంశంపై  తిరిగి చర్చ కొనసాగనుంది. బిల్లు పై రాష్ర్టపతి ఈ నెల 23 వరకూ సమయం ఇచ్చారు. అయితే గడచిన అసెంబ్లీ సమయంలో సరిగా చర్చజరగనే లేదు.  ఈ నేపధ్యంలో ఇప్పడు జరగబోయే ఈ ఆరు రోజుల సమావేశాలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఆదివారం  తప్పించి మిగిలిన ఆరురోజులు  అసెంబ్లీ సాగనుంది.

అసెంబ్లీలో ఈ అంశంవై ఇప్పటివరకూ ఆరుగురు  సభ్యులు మాత్రమే మాట్లాడారు.  మొత్తం 249 మంది సబ్యులుండగా ఇంత తక్కువ మంది మాట్లాడడం విశేషం.  అందుకే  అందరూ మాట్లాడేందుకు  తగిన సమయం కోసం గడువును పొడిగించాలని  రాష్ర్టపతిని సీమాంధ్ర మంత్రులు కోరుతున్నారు. మరో 10 రోజులు గడువు తప్పక ఇస్తారని వారు నమ్ముతున్నారు.

అవసరమైతే ఆదివారం కూడా చర్చకొనసాగించాలని, రాత్రి పగలు తేడా లేకుండా చర్చ సాగించాలని సూచిస్తున్నారు. కాగా ఈనెల 20 నుంచి సవరణలు, సూచనలుపై చర్చకొనసాగనుంది. దీనిలో భాగంగా శాసన సభలో రెండు రోజుల పాటు చర్చ జరగ నుంది.  ఇదిలా ఉంటే గవర్నర్ కు అధికారాలను ఇవ్వడాన్ని తెలుగుదేశం, బిజెపి, తెలంగాణ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.  మరో వైపు ఓటింగ్ ఎలా తీసుకుంటారన్నది కీలకంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles