No intrust on t chief minister post says sarve

first Chief Minister of Telangana State should be a Dalit, decision on Telangana by 2014,Union minister Sarve Satyanarayana, The Telangana MPs want a positive statement

no intrust on t chief minister post says sarve

సర్వేకు ముఖ్యమంత్రి కోరిక లేదట

Posted: 01/16/2014 04:04 PM IST
No intrust on t chief minister post says sarve

త్వరలో ఏర్పాటుకాబోయే  తెలంగాణకు ఎవరు ముఖ్యమంత్రి  అవుతారన్న అంశం అందరి నోళ్లలో నానుతోంది. ఈ నేపధ్యంలో నేనంటే నేనంటూ పలువురు నాయకులు పోటీపడుతూ స్టేట్ మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఇటువంటి సమయంలో కేంద్ర మంత్రి సర్వే సత్యన్నారాయణ మాత్రం తాను ముఖ్యమంత్రి  రేసులో లేనంటూ చెబుతున్నారు. అయితే రాహుల్ గాంధీ సారధ్యంలో  ఏర్పడే ప్రభుత్వంలో  మంత్రి పదవిని ఆశిస్తున్నానని  తెలిపారు. పైగా తాను ఎప్పుడూ మఖ్యమంత్రి  పదవి ఆశించలేదని, కానీ కొందరు కూడబలుక్కుని  తనపై లేని పోని ఆరోఫణలు చేస్తున్నారని  అన్నారు.

ఇదిలా ఉండగా, అసెంబ్లీలో బిల్లు చర్చకోసం ఇచ్చిన గడువును మరింత పెంచమనడం తగదని అన్నారు.. ఈ విషయంలో తాను రాష్ర్టపతిని కలిసి విన్న వించనున్నట్లు  తెలిపారు. తెలంగాణకు  చెందిన దళితునికే ముఖ్యమంత్రి  పదవి ఇవ్వాలని గతంలో సర్వే సత్యన్నారాయణ  డిమాండ్ చేశారు. తెలంగాణ  ఏర్పాటు చారిత్రక ఘట్టమవుతుందని, అందుకే దళితునికి  ముఖ్యమంత్రి  పదవి ఇవ్వడం ద్వారా దళితుల ఆత్మ గౌరవం పెరుగుతుందన్నారు. 

ఈ సందర్భంగా  పిసిసి ఛీఫ్ బొత్స స్పందిస్తూ  2014లో ఇద్దరు పిసిపి ఛీఫ్ లు, ఇద్దరు ముఖ్య మంత్రులు తెలుగు రాష్ర్టానికి  ఉండడం ఖాయమన్నారు. అదేవిధంగా తెలంగాణా కాంగ్రెస్ నాయకులు  రాష్ర్ట ఏర్పాటు గురించి  మాట్లాడుతూ  గతంలో దివంగత ఇందిరాగాంధీకూడా  తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించలేదని, కొందరు సీమాంధ్ర నాయకు లు ఈ విధంగా మాట్లాడడం తగదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles