Sridharababu visit to karimnagar

Sridharababu visits Karimnagar, Srisharababu maiden visit to karimnagar, Sridharababu resignation, Sridharababu Telangana Tiger

Sridharababu maiden visit to karimnagar after resignation

కిరణ్ కుమార్ ని తరిమి తరిమి కొట్టే కార్యక్రమం

Posted: 01/11/2014 04:31 PM IST
Sridharababu visit to karimnagar

కిరణ్ కుమార్ మాస్క్ లను వేసుకున్న మనుషులను తరిమి తరిమి కొడుతూ కరీం నగర్ లో రేపు తమ నిరసనను వినూత్నంగా ప్రదర్శించబోతున్నారు ఆందోళనకారులు.

తెలంగాణా బిల్లు చర్చకు వస్తున్న సమయంలో శాసనసభ వ్యవహారాల శాఖను తననుంచి వేరు చేసినందుకు ఎవరు ఎంత వారించినా వినకుండా మంత్రి పదవికి రాజీనామా చేసిన శ్రీధరబాబు ఆ దెబ్బతో తెలంగాణాలో హీరో అయిపోయారు.  నాకు పదవి ముఖ్యం కాదు తెలంగాణా సాధనే లక్ష్యం అన్న శ్రీధరబాబుకు పార్టీతో సంబంధం లేకుండా తెలంగాణా నాయకులను కూడదీసే పనిని కూడా అప్పగించారంతా కలిసి.  

కిరణ్ కుమార్ కి వ్యతిరేకంగా ఎన్నో నిరసన కార్యక్రమాలను చేపట్టిన కరీం నగర్ నాయకులు రేపు ఆదివారం మొదటిసారిగా కరీం నగర్ సందర్శించబోతున్న శ్రీధరబాబుకి చేసే స్వాగతం పలుకున్న వేడుకను పై విధంగా కిరణ్ కుమార్ ని తరిమి కొడుతున్న సన్నివేశాన్ని రచించి ఆయనను అలరించబోతున్నారు.  

మేము మీతో ఉన్నామంటూ శ్రీధరబాబుకి చెప్పటం కోసం ఈ కార్యక్రమాన్నంతా రేపు డిసిసి నిర్వహించబోతోంది.  శ్రీధరబాబుని తెలంగాణా పులిగా అభివర్ణిస్తూ మహిళలు ఆయనకు హారతినిచ్చి స్వాగతం పలుకుతారు.  

శ్రీధరబాబు రాజీనామాతో తెలంగాణాలో శ్రీధర్ బాబు తెలంగాణా టైగర్ అయిపోయారు, అంతకు ముందునుంచే అధిష్టానాన్ని ఎదుర్కున్న ఘనత దక్కించుకున్న కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర టైగర్ అయిపోయి, శ్రీధరబాబుని మంత్రిత్వ శాఖ నుంచి తప్పించి మరోసారి హీరో అనిపించుకున్నారు.  

తమాషా ఏమిటంటే ఇద్దరూ కాంగ్రెస్ నాయకులే.  ఇద్దరూ అంతకు ముందు సన్నిహితంగా మెలిగినవారే.  అలాంటిది ఇద్దరూ రాజకీయ చదరంగంలో వైరులుగా మారిపోయారు. 

ఇరు ప్రాంతాలలో ఇతర రాజకీయ వర్గాలను పడగొట్టాలంటే కాంగ్రెస్ పార్టీకి పులులు కావాలి మరి

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles