Pepsico drinking water om

PepsiCo drinking water Om, cocacola co, Golden Globes Awards, 71 Golden Globes, Pepsi water in golden gloabes

PepsiCo drinking water Om

పెప్సీ కంపెనీ వారి శుద్ధ తాగు నీరు 'ఓం'?

Posted: 01/11/2014 05:25 PM IST
Pepsico drinking water om

కోకాకోలా తర్వాత కూల్ డ్రింక్స్ లో అగ్రగామైన పెప్సీ కంపెనీ కూడా వాటర్ బాటిల్ ని మార్కెట్ లోకి వదులుతోంది.

పూర్వం రాజుల కాలంలో రాజులు తినే పదార్థాలను ముందుగా సేవకులు భుజించి చూసేవారట.  ఏమో అందులో ఏం కలిపారోనన్న భయం.  అయితే ఈ కాలంలో ప్రజలే రాజులు కాబట్టి ముందుగా రుచి చూడవలసినవారు ప్రజలలో పెద్దలు, ప్రజాసేవకులే కాబట్టి వాళ్ళకే ముందుగా సేవించటానికి పురమాయించాలి కదూ. 

అలాగని కాదు కానీ పెప్సీ కంపెనీ క్వా అనే పేరుతో పరిశుద్ధమైన తాగునీటి బాటిల్ ని మార్కెట్ చెయ్యటానికి ముందుగా ఆ ఉత్పాదనను గోల్డెన్ గ్లోబ్స్ లో ప్రవేశపెట్టి అక్కడి ప్రముఖులకు ఉచితంగా సప్లై చెయ్యటానికి సిద్ధమైంది.  ఎందుకంటే వాళ్ళు చేసే ప్రకటనలకు చాలా విలువుంటుంది కాబట్టి. 

అందుకే ఈ ఉత్పాదన పేరు (క్వా), దాని బాటిల్ డిజైన్ కూడా మారినా మారవచ్చని అంటున్నారు.  అంటే గోల్డెన్ గ్లోబ్ లో ప్రముఖ అతిథుల సూచనలను తీసుకుని వాటిని పాటిస్తారన్నమాట. 

కోకాకోలా మార్కెట్ లో ప్రవేశపెట్టిన స్మార్ట్ వాటర్ మార్కెట్ లో 16 శాతం పొందగలిగింది కాబట్టి మిగతా మార్కెట్ లో వాటా కోసం పెప్సీ కంపెనీ మార్కెట్ చెయ్యబోతున్న ఈ ఉత్పాదనకు బివరేజ్ డైజెస్ట్ మాగజైన్ పబ్లిషర్ సూచించినట్లుగా అక్వా ని సూక్ష్మంగా చేస్తూ క్వా అని పిలుస్తున్న దాన్ని ఓం అనే పేరుతో మార్కెట్ చెయ్యటానికి అవకాశం ఉందని చెప్తున్నారు. 

71 వ గోల్జెన్ గ్లోబ్ పురస్కారాల వేడుకను బివెర్లీ హిల్టన్ లో రేపు జనవరి 12 న స్థానిక సమయం ప్రకారం రాత్రి 11 గంటల నుంచి ప్రారంభించనున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles