Janta darbar conducted kejriwal

Janta Darbar conducted Kejriwa, AAP Arvind Kejriwal, JP Loksatta, Delhi Janta Darbar, Tremendous response to Janta Darbar

Janta Darbar conducted Kejriwal

కొలువుతీరిన కేజ్రీవాల్, హాజరైన ప్రజావాహిని

Posted: 01/11/2014 02:35 PM IST
Janta darbar conducted kejriwal

ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్వహించిన జనతా దర్బార్ కి తండోపతండాలుగా ప్రజలు హాజరయ్యారు.  వారికున్న వివిధ సమస్యలమీద ఫిర్యాదులు తీసుకునివచ్చారు.  ప్రతి శనివారం ఫిర్యాదులు అందుకోవటానికి ఢిల్లీలో ముఖ్యమంత్రి ఉదయం 9.30 నుంచి 11.30 వరకు నుంచి జనతా దర్బార్ నిర్వహిస్తామని కేజ్రీవాల్ అన్నారు. 

మొదటిసారి కాబట్టి చాలా ఎక్కువ మంది వచ్చారని, తొక్కిసలాట జరిగే ప్రమాదమున్నందున మధ్యలోనే వదిలి వెళ్ళవలసివచ్చిందని కేజ్రీవాల్ అన్నారు.   ఈ సారి నుంచి ఒక్కోసారి ఒక్కో సమస్య మీద జనతా దర్బార్ ఉంటుందని, దాని వలన రద్దీ తగ్గుతుందని, దానితో అనుకున్న పనులను సక్రమంగా చెయ్యటానికి అవకాశముంటుందని ఆయన అన్నారు. 

వచ్చినవారిలో అధికశాతం అరవింద్ కేజ్రీవాల్ ని అభినందించటానికి వచ్చినవాళ్ళే ఉన్నారని అన్న కేజ్రీవాల్, అధికతర ఫిర్యాదులు అధికారుల మీదనే ఉన్నాయని కూడా తెలియజేసారు. 

లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఈ రోజు కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles