Kavita explodes on kirna kumar

Kavita explodes on Kiran Kumar, Kavita bomb remark on CM, Telangana Jagruti, TRS President KCR, KCR daughter Kavita

Kavita explodes on Kiran Kumar

కిరణ్ కుమార్ మీద కవిత బాంబు దాడి

Posted: 01/08/2014 09:46 AM IST
Kavita explodes on kirna kumar

మొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ హెలికాప్టర్ ని గాల్లోనే పేల్చేస్తామని కరీం నగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ బెదిరించగా, ఇప్పుడు తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్ కూతురు కవిత ఏకంగా బాంబులనే వేస్తామని బెదిరిస్తున్నారు.

వాక్స్వాతంత్ర్యం ఎవరికున్నా లేకపోయినా రాజకీయనాయకులకు మాత్రం బాగా ఉందని ఈ ఘటనలతో తెలిసిపోతోంది.  పత్రికా స్వాతంత్ర్యం కన్నా మిన్నగా కనిపిస్తోంది వారికున్న భాషా స్వేచ్ఛ. 

తెలుగు దేశం అధ్యక్షడుది రెండు కళ్ళ సిద్ధాంతమని ఎద్దేవా చేస్తూ వచ్చిన నేతలకు తాజాగా కిరణ్ కుమార్ ని క్రికెట్ ఆటగాళ్ళతో పోల్చి మాట్లాడటం మామూలైపోయింది.  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే పనిలో ఆఖరు బంతి వరకూ పోరాడుతాను అని అన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని దిగ్విజయ్ సింగ్ తో చాలామంది బ్యాట్, బాల్, బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్టింగ్ క్రికెట్ కోర్టు లాంటి పదాలనుపయోగించి వ్యాఖ్యానిస్తున్నారు. 

అలాగే కవిత కూడా తెలంగాణా మహిళలు కిరణ్ కుమార్ రెడ్డికి బంతులతో కాకుండా బాంబులతో బౌలింగ్ చేస్తామని హెచ్చరించారు.  సమైక్యవాదిగా బాహాటంగా ప్రకటించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీద, తెలంగాణా ఐకాస చెపట్టిన సంపూర్ణ తెలంగాణా దీక్ష కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆ రోజుల్లో నిజాం నవాబులనే ఎదుర్కున్నం గీ కిరణ్ కుమార్ ఓ లెక్కనా అంటూ కవిత పైవిధంగా వ్యాఖ్యానించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles