Uncertainty on telangana bill

AP Assembly adjournments, AP Council adjournments, Telangana bill, protests in AP Assembly

uncertainty on t bill due to assembly adjournments

తెలంగాణా బిల్లు పై అనిశ్చితి, వీడని ఉత్కంఠ

Posted: 01/03/2014 11:24 AM IST
Uncertainty on telangana bill

నూతన సంవత్సర శుభాకాంక్షలతో సభను ప్రారంభించి స్పీకర్ నాదెండ్ల మనోహర్ విపక్షాల వాయిదా తీర్మానాలను తిరస్కరించారు.  దానితో సభలో గందరగోళం ఏర్పడి సభను అరగంట వాయిదా వేసారు.  ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభించిన తర్వాత కూడ తెలంగాణా, సీమాంధ్ర శాసన సభ్యులు స్పీకర్ పోడియం దగ్గర చేరుకుని గట్టిగా నిరసనలను తెలియజేయటంతో సభను తిరిగి గంటసేపు వాయిదా వేసారు స్పీకర్.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సభకు హాజరయ్యారు.  కానీ ఇతర శాసన సభ్యలు తక్కువగా ఉండి సభ పల్చగా ఉంది.  కానీ వాడి వేడి ఆందోళనలు, దరిమిలా సభను వాయిదాలు వెయ్యటం మాత్రం సజావుగానే సాగింది. 

శాసన మండలిలోకూడా అదే వైఖరి ఉండటంతో శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి 10 గంటలకు మొదలైన సభను గంటసేపు వాయిదా వేసారు. 

రాష్ట్ర పునర్విభజన బిల్లు విషయంలో ఉత్కంఠ మాత్రం వీడకుండావుంది.   అయితే ఇలాగే సాగితే జనవరి 23 న ఏం జరుగుతుందన్నది కూడా అంతుపట్టకుండా ఉంది.  ఆ రోజు బిల్లుని రాష్ట్ర పతికి పంపించవలసిన ఆఖరు తేదీ. 

సభలో చర్చ జరగకపోతే బిల్లు ఆగిపోతుందని సమైక్యవాదులు, సమయం మించిపోతే బిల్లు పార్లమెంటుకి నేరుగా వెళ్ళిపోతుందని తెలంగాణా వాదులు సభను అడ్డుకుంటున్నారని అనిపిస్తోంది.  రాజ్యాంగాన్ని, న్యాయశాస్త్రాలను క్షుణ్ణంగా పఠించాల్సిన అవసరం ఉందిప్పుడు.  ఎందుకంటే చట్టబద్ధంగా ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలన్నవిషయంలో ఎవరికీ సరైన అవగాహన ఉన్నట్లుగా కనపడటం లేదు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles