Sridharababu made scape goat tgv

sridharababu made scape goat- TGV, Minister Sridharababu resigned, Kiran Kumar Reddy, Telangana leaders, Ramachandra Khuntia

sridharababu made scape goat- TGV

శ్రీధరబాబుని బలిపశువుని చేసారు- టిజి వెంకటేష్

Posted: 01/03/2014 10:29 AM IST
Sridharababu made scape goat tgv

మంత్రి శ్రీధరబాబు తన రాజీనామా లేఖను గురువారం రాత్రి ప్రత్యేక దూత ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పంపించారు.  

తననుండి శాసనసభ వ్యవహారాల శాఖను తొలగించారన్న మనస్తాపంతో మంత్రి పదవినుంచి రాజీనామా చేసిన శ్రీధరబాబు ఎంత మంది సీనియర్ నేతలు వారించినా పట్టువిడవకుండా రాజీనామాను చేసారు.  తెలంగాణా నేతలతో పాటు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ, ఉప సభాపతి భట్టీ విక్రమార్క, పిసిసి మాజీ అధ్యక్షుడు డిఎస్, జానారెడ్డి, ఢిల్లీ నుంచి వచ్చిన ఎఐసిసి సెక్రటరీ ఖుంతియా వారించినా వినని శ్రీధరబాబు విషయంలో సీమాంధ్ర మంత్రి టిజి వెంకటేష్ చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది.

శాసన సభ ఆవరణలో శాసన సభ వాయిదా సమయంలో మీడియా పాయింట్ లో మాట్లాడిన టిజి వెంకటేష్ తెలంగాణా నేతలంతా కలిసి శ్రీధరబాబుని బలిపశువుని చేసారని విమర్శించారు.  ఒకవేళ తెలంగాణాకు అన్యాయం జరిగిందని భావించినట్లయితే ఆ ప్రాంతానికి చెందిన మంత్రులంతా రాజీనామాలు చెయ్యాలి కానీ అలా ఒక మంత్రిని బలిపశువుని చెయ్యటం సరికాదని అన్నారు.  

పైకి రాజీనామా చెయ్యవద్దని చెప్తున్నా, ముఖ్యమంత్రి తీసుకున్న చర్యకు తెలంగాణా వ్యాప్తంగా నిరసన వెల్లువెత్తాలంటే శ్రీధర బాబు రాజీనామా చెయ్యవలసిందే.  అప్పుడే ఆయన మీద అభిమానం, ముఖ్యమంత్రి పట్ల నిరసన తలెత్తే అవకాశం ఉంది.  తెలంగాణా నాయకులు, అధిష్టానం కూడా అలా చేయించారని టిజి ఉద్దేశ్యం గా కనపడుతోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles