Manmohan singh declares new pm

manmohan singh declares new pm, prime minister, PM Manmohan Singh, Rahul Gandhi able PM, Manmohan confident UPA 2014

manmohan singh declares new pm

కొత్త ప్రధాని ప్రకటనచేసిన మన్మోహన్ సింగ్

Posted: 01/03/2014 11:43 AM IST
Manmohan singh declares new pm

రాబోయే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న ధీమాను వ్యక్తం చేసిన మన్మహన్ సింగ్ మూడవసారి కూడా కాంగ్రెస్ అధికారంలో వస్తుంది కానీ తను మాత్రం మూడవసారి ప్రధాన మంత్రిగా కొనసాగదలచుకోలేదని స్పష్టం చేసారు. 

పత్రకారులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మన్మోహన్ సింగ్ యుపిఏ ప్రభుత్వం సాధించిన విజయాలను గుర్తు చేసారు.  దేశం అభివృద్ధి పథంలోకి పయనిస్తోందన్న విశ్వాసాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి ఓటర్లలో కూడా చైతన్యం బాగా వచ్చిందని ప్రశంసించారు. 

ఎన్నికల తర్వాత ప్రధాన మంత్రి పదవిని కొత్త ప్రధాన మంత్రికి అప్పగిస్తానని చెప్పిన మన్మోహన్ సింగ్, ఆ వ్యక్తి ఎవరన్నది పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు.  అయితే రాహుల్ గాంధీ ఆ పదవికి సమర్దుడనే అభిప్రాయాన్ని కూడా ఆయన తెలియజేసారు.  కాకపోతే నిర్ణయమంతా పార్టీదేనని అది సరైన సమయంలో జరుగుతుందని, తను మాత్రం కొనసాగనని మన్మోహన్ సింగ్ అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles