Aicc secy ramchandra khuntia visits hyderabad

AICC Secy Khuntia Hyderabad Visit, Kiran Kumar Reddy, Digvijay Singh, Ramchandra Khuntia, Sridhara Babu, Sailajanath

AICC Secy Ramchandra Khuntia visits Hyderabad

ఈ సారి కేంద్రం నుంచి వచ్చిన మరో కొత్త ముఖం కుంతియా !

Posted: 01/02/2014 11:33 AM IST
Aicc secy ramchandra khuntia visits hyderabad

రేపు శుక్రవారం శాసనసభలో రాష్ట్ర పురనర్విభజీకరణ బిల్లు మీద చర్చకు వస్తుండటం, అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభా వ్యవహారాల మంత్రిత్వ పదవిని తెలంగాణా మంత్రి శ్రీధరబాబు నుంచి తప్పించి పక్కా సమైక్యాంధ్ర మంత్రైన శైలజానాధ్ కి అప్పగించటం మీద వెల్లువెత్తిన నిరసనల దృష్ట్యా, అఖిలభారత కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రామచంద్ర కుంతియా హైద్రాబాద్ విచ్చేయటం సర్వత్రా ఉత్కంఠను కలుగుజేస్తోంది. 

రేపు శాసనసభలో సన్నివేశం ఎలావుంటుందన్నదానిమీద వివిధ రకాలుగా ఊహాగానాలు చోటుచేసుకుంటున్నాయి.  తెలంగాణా బిల్లు మీద పీటముడి పడకుండా ఉండటం కోసం, బిల్లు సజావుగా ఉభయ సభలలోనూ పాస్ అవటం కోసం అధికారికంగా రాష్ట్రానికి వచ్చిన రామచంద్ర కుంతియా ఏం చేస్తారన్నది కూడా ఆసక్తికరంగా రాజకీయ రంగంలో అందరూ ఎదురు చూస్తున్నారు. 

వస్తూనే కుంతియా చెప్పిన విషయం మంత్రిత్వ శాఖలను పర్యవేక్షించే మంత్రులను బదిలీ చేసే అధికారం రాష్ట్ర ముఖ్యమంత్రికే ఉందని. 

రాష్ట్రానికి కొత్తగా వచ్చేవారికో ప్రత్యేకతుంటుంది.  చెప్పదలచుకున్నవాటిని చెప్పటం, చెప్పదలచుకోనివాటిని తెలియనట్టుగా మరోసారి అడగటం చెయ్యవచ్చు.  కొత్తవారు కాబట్టి విషయాలను తెలియజెప్పాలనే ఉద్దేశ్యంతో అందరూ పోటీలు పడి మరీ కథనాలను వినిపిస్తుంటారు.  అందులో తమకు అనుకూలంగా ఉన్నవాటిని తీసుకోవచ్చు.  అంతే కాకుండా చెప్పీ చెప్పీ మళ్లీ మళ్ళీ మాటలు మార్చి మార్చి చివరకు ఆ పని చెయ్యలేని స్థితికి వచ్చినప్పుడు కొత్త ముఖాన్ని పంపించటం జరుగుతుంటుంది.  అందువలన ఒకసారి ఆజాద్ అయితే మరోసారి దిగ్విజయ్, తర్వాత అహ్మద్ పటేల్, మరోసారి చిదంబరం, ఆంటోనీ ఇలా మార్చి మార్చి ప్రతినిధులను పంపించటం జరుగుతుంది. 

కేంద్రం నుంచి ఎవరు వచ్చినా ఆదేశాలు వచ్చేవి ఒక దగ్గరినుంచే అని అందరికీ తెలుసు.  అయినా ఏదో ఎవరి ఆత్రుత వారిది.  సర్ సర్ అంటూ కొత్తగా ఢిల్లీ నుంచి వచ్చేవాళ్ళకి హారతులు పట్టటం రాష్ట్ర నాయకులకు అలవాటే. 

రేపు ఏం జరుగుతుంది, ఈ లోపులో కుంతియా ఏ వ్యూహాన్ని పన్నుతారన్నది చూడాలి!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles