Cooking gas state subsidy removed

cooking gas state subsidy removed, cooking gas rate up by Rs.25, AP state liability to Gas companies, Non subsidy gas up by Rs.215, Cooking gas rate Rs.444

cooking gas state subsidy removed

వంట గ్యాస్ సబ్సిడీని ఎత్తివేసిన రాష్ట్ర ప్రభుత్వం

Posted: 01/02/2014 10:08 AM IST
Cooking gas state subsidy removed

ప్రతి వంట గ్యాస్ సిలిండర్ మీద రాష్ట్ర ప్రభుత్వం మోస్తున్న రాయితీని ఎత్తివెయ్యటానికి ముఖ్యమంత్రి టేబుల్ మీద ప్రతిపాదన కొంతకాలంగా పెండింగ్ లో ఉంది.  కొత్త సంవత్సరంలో ఆర్ధిక భారాన్ని తగ్గించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం రాయితీని ఎత్తివేసి ఆ విషయాన్ని గ్యాస్ కంపెనీలకు తెలియజేస్తూ జనవరి 1 నుంచి అమలులోకి తెమ్మని కోరింది.  ఈ సందేశం ప్రస్తుతానికి మౌఖికంగానే వున్నా, బకాయిల దృష్ట్యా గ్యాస్ కంపెనీలు దీన్ని అమలులోకి తెస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం వంట గ్యాస్ మీద సబ్సిడీలో రూ.25.00 మేరకు రాష్ట్ర ప్రభుత్వం అందించే సబ్సిడీని ఎత్తివేయటంతో ప్రస్తుతమున్న గ్యాస్ ఖరీదు రూ.419 నుంచి రూ.444 పెరిగింది.  ఈ విషయాన్ని గ్యాస్ కంపెనీలకు తెలియజేసిన రాష్ట్ర ప్రభుత్వం తద్వారా ఆయా కంపెనీలకు బాకీ పడ్డ రూ.600 కోట్లలో కొంతైనా తగ్గుతుందని ఆశిస్తోంది. 

అంతే కాకుండా సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ల ధరను ఏకంగా రూ.215.00 పెంచి ప్రస్తుతం గ్యాస్ ధరను రూ.1326.00 చెయ్యటం జరిగింది.  అంటే సంవత్సరానికి 9 సిలెండర్ల గ్యాస్ ని సబ్సిడీ రెట్ల మీద అందుకున్న వినియోగ దారులు అది దాటిన తర్వాత పెరిగిన రూ.1326.00 కి కొనుగోలు చెయ్యవలసివుంటుంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles