Cm s helicopter will be blasted in air warns ponnam prabhakar

cm helicopter will be blasted in air warns ponnam prabhakar, MP Ponnam Prabhakar, Kiran Kumar Reddy, Sripada Yellampalli Project, Minister Sridharababu,

cm's helicopter will be blasted in air warns ponnam prabhakar

ముఖ్యమంత్రి హెలికాప్టర్ ని పేల్చివేస్తామని హెచ్చరిక

Posted: 01/02/2014 12:48 PM IST
Cm s helicopter will be blasted in air warns ponnam prabhakar

కరీం నగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి మీద తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ, కిరణ్ కుమార్ రెడ్డి గాని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవాలకు వస్తే ఆయన హెలికాప్టర్ ని గాల్లోనే పేల్చివేయటం జరుగుతుందని హెచ్చరించారు. 

అంతే కాదు, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి కరీం నగర్ జిల్లాలో పర్యటన ఎలా చేస్తారని ప్రశ్నించారు పొన్నం.

శాసన సభ వ్యవహారాల శాఖను డిసెంబర్ 31న తెలంగాణా మంత్రి శ్రీధరబాబు నుంచి తొలగించి సమైక్యాంధ్రకు బహిరంగంగా పాటుపడుతున్న మంత్రి శైలజానాధ్ కి అప్పగించటంతో ఆగ్రహం చూపిస్తున్న తెలంగాణా నాయకులంతా తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంటే పొన్నం ప్రభాకర్ ఏకంగా ఉగ్రస్థాయిలో స్పందిస్తూ ఆయన హెలికాప్టర్ నే గాలిలో పేల్చివేస్తామని చెప్తూ తమ నిరసనను చాటారు. 

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ని 2004 లో వైయస్ రాజశేఖర్ రెడ్డి శంఖుస్థాపన చేసి ప్రారంభించారు.  దివంగత నాయకుడు డి శ్రీపాదరావు పేరు మీద గోదావరి నదీజలాల మీద ఈ ప్రాజెక్ట్ ని నిర్మించారు.  దీని ద్వారా 63 టిఎమ్ సి ల నీటిని వ్యవసాయానికి వాడుకోవటానికి ఉపయోగపడుతుంది.  ఇది రామగుండంలోని ఎన్ టి పిసి రిజర్వాయర్ కి కూడా నీటిని అందిస్తుంది. 

జలయజ్ఞం లో భాగంగా చేపట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో గల 62 గేట్లలో 45 గేట్ల వరకు ఉపయోగం లోకి వచ్చిన సందర్భంగా మంత్రి శ్రీధరబాబు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 2013 ఆగస్ట్ 15 న జాతీయ పతాకాన్ని అక్కడ ఎగురవేసారు.  ఆ సందర్భంలో ఆయన వచ్చే స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో చేసుకుంటామని కూడా తెలియజేసారు. 

ఇప్పుడా మంత్రినే శాసన సభ వ్యవహారాల నుంచి తొలగించటంతో ఆగ్రహించిన పొన్నం ప్రభాకర్ పై విధంగా వ్యాఖ్యానిస్తూ తన నిరసనను ప్రకటించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles