Arvind kejriwal keeps free water promise

Arvind Kejriwal water promise, Aam Aadmi Party, Arvind Kejriwal, Delhi, Delhi Jal Board, Rakhi Birla

Arvind Kejriwal has kept his promise to Delhi. On Monday, his third day as Delhi chief minister, he announced the supply of 20 kilolitres a month (almost 700 litres a day) of free water for Delhi households from January 1, 2014.

కేజ్రీవాల్ మాటలు నీటి మూటలు కాదు

Posted: 12/30/2013 07:32 PM IST
Arvind kejriwal keeps free water promise

దేశ రాజధాని ఢిల్లీ పీఠాన్ని అధిష్టించిన సామాన్య ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను తీర్చేందుకు మూడో రోజు నుండే నడుం బిగించాడు. శనివారం రోజున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేజ్రీవాల్ అనారోగ్యంతో బాధపడుతున్నా ప్రజలకు ఇచ్చిన మాట కోసం తొలి వాగ్ధానాన్ని నెరవేర్చాడు.

తన నివాసంలో జలమండలి అధికారులతో సమావేశం అయ్యి కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలి వాగ్దానమైన 700 లీటర్ల మంచినీరు సరఫరా పథకాన్ని జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని ఆదేశించారు. ఒక ఇంటికి 20 కిలో లీటర్ల మంచినీటి సరఫరా చేయాలని చెప్పారు.

ఇది సక్రమంగా అమలు అయితే 700 లీటర్ల సరఫరా జరిగినట్లే. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ పథకం పై సమీక్ష నిర్వహించి లోటు పాట్లు ఉంటే సరిదిద్దుకుంటామని, నీటి కనెన్షన్లు, మీటర్లు ఉన్న ప్రతి ఇంటివారు ఈ ఉచిత నీటి సరఫరాను వినియోగించుకోవచ్చని, పరిమితిని మించి వాడుకున్న వారు మొత్తం నీటికి బిల్లు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.

అంతేకాకుండా డిసెంబర్ 27 తేదీన ఢిల్లీలో లిక్కర్ మాఫియా చేతులో హతమైనట్లు భావిస్తున్నట్లు కానిస్టేబుల్ కుటుంబానికి ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కోటి రూపాయల నష్ట పరిహారాన్ని ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles