Chandra babu is corrupted says laxmi parvathi

Chandra babu, corrupt, Laxmi parvathi, chandra babu corrupted, samrat

chandra babu is corrupted says laxmi parvathi.

బాబు అవినీతి సామ్రాజ్యానికి సామ్రాట్

Posted: 12/31/2013 08:40 AM IST
Chandra babu is corrupted says laxmi parvathi

ఎన్.టి,ఆర్. టీడీపీ పార్టీ అధ్యక్షురాలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతురాలు అయిన లక్ష్మిపార్వతి టీడీపీ అధినేత చంద్రబాబు పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు విరుచుకుపడే ఈమె ‘ప్రజా గర్జన ’ పేరుతో టీడీపీ నిర్వహిస్తున్న సభల్లో చంద్రబాబు అవినీతి పై మాట్లాడం విడ్డూరంగా ఉందని, అసలు అవినీతి సామ్రాట్ చంద్రబాబే అని అన్నారు.

చంద్రబాబును మించిన అవినీతి పరుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని ఆయన మామ ఎన్టీఆర్ నాతో స్వయంగా అన్నాడని, గతంలో చంద్రబాబు అవినీతిపై ‘బాబు జమానా - అవినీతి ఖజానా’ అనే పుస్తకాన్ని కమ్యూనిస్టు పార్టీ, ‘వంద తప్పులు ’ అంటూ బీజేపీ పుస్తకాలను ప్రచురించాయని ఆమె అన్నారు.

మరో వైపు బొత్స సత్యనారాయణ కూడా బాబు పై విరుచుకు పడ్డారు. అసలు అవినీతిని పెంచి పోషించింది చంద్రబాబే అని అన్నారు. ఇటు వైకాపా మద్దతురాలు, అటు కాంగ్రెస్ పార్టీ బాబు పై మూకుమ్మడి దాడి చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles