Yeddyurappa return to bjp

BS Yeddyurappa, former Karnataka chief minister, return back to BJP,Karnataka Janatha Paksha party, KJP,BJP president Rajnath Singh,

Karnataka Chief Minister B.S. Yeddyurappa on Monday said he would return to the BJP.

యడ్యూరప్ప మళ్లీ కమలంలోకి

Posted: 12/30/2013 06:34 PM IST
Yeddyurappa return to bjp

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు అవినీతి ఆరోపణలు, పార్టీలో గ్రూపు రాజకీయాలు నడిపి బీజేపీ అధిష్టానంతో కయ్యానికి కాలుదువ్వి, పార్టీ నుండి బయటికి వెళ్లి ‘కర్ణాటక జనతా పార్టీ ’ పేరుతో కొత్త పార్టీ పెట్టి బీజేపీ ఓట్లు చీల్చి తాను , బీజేపీ పార్టీ పార్టీ ఘోర పరాజయానికి కారణం అయిన ఆయన తిరిగి మళ్లీ కమలంలోకి రావడానికి సిద్దం అవుతున్నాడు.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించాడు. ఘోర పరాజయం తరువాత మళ్ళీ కమలం పార్టీలోకి వెళ్ళడానికి అధిష్టానం చుట్టు కాళ్ళరిగేలా తిరిగి ఆయన చేసిన ప్రయత్నాలు చివరికి ఫలించాయి. దీంతో ఆయన పార్టీలో చేరేందుకు సిద్దం అయ్యారు. తాను స్థాపించిన పార్టీని కమలంలోనే విలీనం చేసి, ఆ పార్టీ నాయకుడిగానే కొనసాగుతానని చెప్పుకొచ్చాడు.

ఇప్పటికే తాను మానసికంగా బీజేపీ పార్టీ నేతనని, అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావడమే తరువాయి అని ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. మరి పార్టీ ఓటమికి ఒకరకంగా కారణం అయిన యడ్డీ మళ్లీ కమలంలోకి వస్తే ప్రజలు ఆదరిస్తారా లేదా అన్నది చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles