No invitation for tdp praja garjana says harikrishna

nandamuri harikrishna,tdp praja garjana,tirupati tdp praja garjana'

nandamuri harikrishna,tdp praja garjana,tirupati tdp praja garjana'

హరిక్రిష్ణను అవమానించారు

Posted: 12/29/2013 01:48 PM IST
No invitation for tdp praja garjana says harikrishna

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి, ఆయన బావమర్ది హరిక్రిష్ణకు గత కొంత కాలం నుండి పడటం లేదనే వార్తలు ప్రచారంలో ఉన్నవిషయం తెలిసిందే. గత కొంత కాలం నుండి సమైక్యాంధ్ర నినాదాన్ని వినిపిస్తూ పార్టీకి దూరంగా ఉంటున్న హరిక్రిష్ణ నేడు చంద్రబాబునాయుడి పై అసంత్రుప్తిని వ్యక్తం చేశాడు. ఈ రోజు తిరుపతిలో తెలుగుదేశం పార్టీ ప్రజా గర్జన పేరుతో సభను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రజాగర్జనకు హరిక్రిష్ణకు పార్టీ నుండి ఆహ్వానం పంపలేదు. పార్టీ తీరు పై, చంద్రబాబు పై హరిక్రిష్ణ  తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. ఈ రోజు తిరుపతిలో జరుగుతున్న పార్టీ ప్రజా గర్జన మహాసభకు తనకు ఆహ్వానం అందలేదని ఆయన తెలిపారు.

సమైక్యాంధ్ర అన్నందుకే పార్టీ కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదన్న అనుమానం కలుగుతోందని హరికృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర విభజను వ్యతిరేకిస్తూ రాజ్యసభ సభ్వత్వానికి ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరి పార్టీ కార్యక్రమానికి కూడా హరిక్రిష్ణను పిలవకపోవడంతో బామ బామ్మర్ధుల మధ్య బాగానే అంతరం ఏర్పడినట్లు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles