Tdp naidu fires on sonia and jagan

chandrababu fires on Sonia, chandrababu fires Y.S.Jagan, Chandrababu slams Sonia,Y.S.Jagan,Chandrababu at TDP Praja Garjana Sabha

chandrababu fires on Sonia, chandrababu fires Y.S.Jagan, Chandrababu slams Sonia,Y.S.Jagan,Chandrababu at TDP Praja Garjana Sabha

తిరుపతి సభతో బాబు నిప్పులు

Posted: 12/30/2013 08:59 AM IST
Tdp naidu fires on sonia and jagan

చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగిన తెలుగు దేశం ప్రజా గర్జనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పై , వైయస్ జగన్ పై, సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా పెద్ద ఆనకొండ అయితే వైయస్, జగన్, వాద్రాలు పిల్ల ఆనకొండలని అభివర్ణించాడు.

ఈ ఆనకొండలు దేశాన్ని మింగేశాయని, ఈ అవినీతి ఆనకొండల ఆట కట్టించాలంటే యువ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమవుతోంది. బుద్ధి ఉన్న వాడెవడూ కాంగ్రెస్‌కు ఓటేయడు. అనకొండలాంటి ఆ పార్టీకి ఓటేస్తే.. అది మిమ్మల్నే మింగేస్తుంది. జాగ్రత్త.. అని హెచ్చరించారు. అవినీతిరహిత భారతదేశం కోసం జరుగుతున్న పవిత్ర యుద్ధంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని అభ్యర్థించారు .

అవినీతి రహిత దేశం కోసం తాను పోరాడతానని చంద్రబాబు అన్నారు. ప్రతి ఇండి నుండి ఇద్దరు రొడ్డు పైకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలోని అవినీతి అనకొండలను కేజ్రీవాల్ చంపేశారంటూ 15 ఏళ్లుగా సీఎంగా ఉన్న షీలా దీక్షిత్‌ను చిత్తుచిత్తుగా ఓడించారని గుర్తు చేశారు.

ఇది అవినీతిపై అక్కడి ప్రజల ప్రతిస్పందనని, ఆ స్పందన దేశవ్యాప్తంగా రావాలని పిలుపునిచ్చారు. ఏదో ఒకరోజు తెలుగు  దేశం దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే రోజు వస్తుందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles