We will not leave corrupt congress leaders

aam aadmi party,corruption,congress leaders, arvind kejriwal, Z security, AAP,

We will not leave corrupt congress leaders says aam aadmi party.

అధికారంలోకి రాగానే కాంగ్రెస్ భరతం పడతాం

Posted: 12/24/2013 10:43 AM IST
We will not leave corrupt congress leaders

దేశ రాజకీయాల్లో సంచలనం రేపి, ఢిల్లీలో గద్దెనెక్కనున్న ’ఆప్ ఆద్మీ పార్టీ ’ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కానీ, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతిని అధికారంలోకి రాగానే బయటపెడతామని, అవినీతి పరులైన కాంగ్రెస్ నాయకులకు వదిలిపెట్టేది లేదని పార్టీ స్పష్టం చేసింది.

ఆరోపణలు ఉన్న అందరి నాయకులపైనా, అధికారుల పైనా విచారణ చేయిస్తామని, కాంగ్రెస్ కేవలం బయటి నుంచి తమ ప్రభుత్వానికి మద్దతు ఇస్తోందని, అంతమాత్రాన ఆ పార్టీలో ఉన్న అవినీతిపరులైన నాయకులను వదిలిపెట్టాల్సిన అవసరం లేదని అంటున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి రాసిన లేఖలో అరవింద్ కేజ్రీవాల్ కామన్వెల్త్ క్రీడల గురించి ప్రస్తావించారు. మేం అధికారంలోకి వస్తే వీటిపైనే ముందుగా విచారణ చేయిస్తాం. ఒకవేళ దానివల్ల ప్రభుత్వం పడిపోయినా.. మాకేమీ నష్టం లేదు అని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు యోగేంద్ర యాదవ్ తెలిపారు.

ఓ వైపు ఆపార్టీ మద్దుతుతో ఢిల్లీ గద్దెనెక్కుతోనే ఆ పార్టీతో సంబంధం, పొత్తు లేవని చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని అక్కడి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీని పై ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి. మరోవైపు ఢిల్లీ పోలీసులు కల్పించనున్న జడ్ కేటగిరీ సెక్యూరిటీని కాబోయే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిరాకరించారు. తనకు ఎలాంటి ప్రత్యేక పోలీసుల భద్రత అవసరం లేదని, ఆ దేవుడే రక్షగా ఉంటాడని పేర్కొంటూ, తనకు కల్పించిన జడ్ కేటగిరీ భద్రతను వెనక్కి తిప్పి పంపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles