Jc diwakar reddy still not decided

J.C.Diwakar Reddy, Assembly,Ananthapur,Telugu desam, YSRCP, Congress, JC Diwakar Reddy,Congress,Botsa Satyanarayana

J.C.Diwakar Reddy, Assembly,Ananthapur,Telugu desam, YSRCP, Congress, JC Diwakar Reddy,Congress,Botsa Satyanarayana

జేసీకి ఏ బస్సు డోర్లు తెరచిలేవా ?

Posted: 12/24/2013 02:44 PM IST
Jc diwakar reddy still not decided

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పాటుపడ్డ జేసీ దివాకర్ రెడ్డి ఏ పార్టీ బస్సెక్కాలో అర్థం కావడం లేదని అంటున్నారు. గత కొన్ని రోజుల క్రితం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన ఈయన్ను పార్టీ నుండి వెళ్లి పోవాలని, షోకాజ్ నోటీస్ కూడా పంపినట్లు  పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు తప్పవని హెచ్చరించారు కూడా.

అయితే తమకు ఆ షోకాజ్ నోటీసు అందలేదని, అందిన తరువాత స్పందిస్తానని అంటూనే , కాంగ్రెస్‌ పార్టీలో ఇంకా కొనసాగాలా లేదా వెళ్లిపోవాలా అనే అంశాన్ని తాను ఇంకా నిర్ణయించుకోలేదని, నా సోదరుడు, కుమారుడు ఏ పార్టీలో చేరతారనేది వారి ఇష్టం అని అన్నారు. గత కొన్ని రోజుల నుండి వైకాపాను పొగుడుతూ వస్తున్నా కానీ కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జేసీకి ఏ పార్టీ బస్సువారు డోర్లు తెరిచే పరిస్థితి లేదు.

కాంగ్రెస్ పార్టీలో వుంటే మనుగడ లేదు. తెలుగుదేశంలోకి వెళదామంటే, పరిటాల కుటుంబంతో అనాది వైరం అడ్డు వస్తోంది. వైకాపాలోకి పోదామంటే జగన్ అంత సుముఖంగా లేరు. కానీ జేసీ మాత్రం తనకు తెలుగు దేశం నుండి, వైకాపా నుండి ఆహ్వానాలు అందాయని బీరాలు పలుకుతున్నాడు. మరి కొన్ని రోజుల్లో తేలిపోతుంది జేపీ ప్లేటు ఫిరాయించి ఏ పార్టీలో చేరుతాడనేది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles