Political leaders t bill fight today in ap assembly

t-bill fight, telangana bill war, political leaders t-bill fight, ap assembly, political leaders t-bill fight today, cm kiran, deputy cm damodar rajanarasimha, tdp leader errabelli dayakara rao, seemandhra leaders vs trs leaders, tdp vs trs, political news, latest telugu news, breaking news, headlines

political leaders T-Bill fight today in ap assembly

అసెంబ్లీలో ఎడమొహం-పెడమోహం-టీఆర్ఎస్ దూకుడు

Posted: 12/17/2013 11:02 AM IST
Political leaders t bill fight today in ap assembly

ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. ఇదే సమయంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ అంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా స్పీకర్ ఎదుట నిరసన తెలుపుతున్న సీమాంధ్ర ఎమ్మెల్యేల చేతిలో ఉన్న ప్లకార్డులను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లాక్కున్నారు.

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు శాసనసభ సమావేశాలకు హాజరు అయ్యారు. కాగా సభలో ముఖ్యమంత్రి, డిప్యూటీ స్పీకర్ దామోదర రాజనర్సింహ ఎడమొహం-పెడమొహంగానే ఉన్నారు. డిప్యూటీ సీఎం.... కిరణ్ ను పలకరించినా స్పందన లేదు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య అగాధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా అయితే శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు-2013ను ప్రవేశపెట్టిన సమయంలో అనారోగ్యం కారణంగా సీఎం గైర్హాజరు అయిన విషయం తెలిసిందే.

 

రాష్ట్ర విభజన జరిగిపోయిందని, తెలంగాణ ఆగదని తెలంగాణ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఈరోజు ఆయన అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.... టి. బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో ఆ బిల్లు ఆమోదించేందుకు అందరు మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే సీమాంధ్ర ప్రాంతంలోని అన్ని రాజకీయా పార్టీల నాయకులకు ఆయన ఆమోదించాలని ఆయన సూచించారు. టి.బిల్లు తుది దశకు చేరుకుందన్నారు.

 

అయితే తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిన్న టి. బిల్లుపై మాట్లాడలేదని పలు మీడియా కథనాలను ఎర్రబెల్లి ఈ సందర్భంగా ఖండించారు. చంద్రబాబు నాయుడు విభజనపై వెనక్కి వెళ్లామనో, సమైక్యమనో మాట్లాడలేదని, అయితే టి.బిల్లులోని లోపాలను ఎత్తి చూపిన సంగతిని ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి గుర్తు చేశారు. అలాగే అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందే వరకు ఓపిక పట్టాలని ఆయన తమ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులను హితవు పలికారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles