Pooja for telangana bill papers

telangana bill, telangana war, pooja for telangana bill papers, telangana bill highlights, telangana bill papers, t-bill tabled in assembly, telangana videos, telangana bill finally, andhra pradesh reorganisation bill 2013, pooja at the assembly, t bill confusion in assembly, trs mlc swamy goud, swamy gou performing pooja to t-bill, telangana leaders conducts pooja for telangana bill papers, political news, latest telugu news, breaking news, headlines

Pooja for Telangana Bill Papers

తెలంగాణ బిల్లుకు పసుపు కుంకుమ

Posted: 12/17/2013 11:26 AM IST
Pooja for telangana bill papers

నిన్న తెలంగాణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన వెంటనే.. తెలంగాణ నేతలో ఆనందంతో పొంగిపోయారు. కానీ సీమాంద్ర నేతలు మాత్రం అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అసలే సమైక్యంద్ర కోసం పోరాడుతున్న నేతలకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో సీమాంద్ర నేతలు తెలంగాణ బిల్లును కంటి చూపుతో కాల్చిపాడేశారు. కొంతమంది సీమాంద్ర నేతలు చిరాకుతో .. తెలంగాణ బిల్లుప్రతులను చించిపారేసారు. దీంతో తెలంగాణ నేతల్లో ఆవేశం.. కట్టలు తెంచుకొని.. సీమాంద్ర నేతల పై దాడి దిగిన విషయం తెలిసిందే. ఈ తతంగం అంత .. కొన్ని గంటల్లో జరిగిపోయింది. తెలంగాణ నేతలు తెలంగాణ బిల్లుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు -2013 బిల్లు రాష్ట్ర శాసనసభకు రావడం పట్ల తెలంగాణ ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. అంతేగాక బిల్లు ప్రతులకు పూజలు కూడా నిర్వహించారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీలు తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులకు పూజలు చేశారు. పసుపు, కుంకుమ చల్లి, అగరొత్తులు వెలిగించారు. దిష్టి తీశారు. సభకు బిల్లు రావడం పట్ల ఒకరినొకరు అభినందనలు చెప్పుకున్నారు.

 

అయితే ఈ సందర్బంలో తెలంగాణ నేతలు మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లును ఎవరు అడ్డుకోలేరని అన్నారు. త్వరలో తెలంగాణ వస్తుందని తెలంగాణ నేతల ఆశభావం వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతున్న సందర్బంలో అన్నదమ్ముల్ల విడిపోదాం అని తెలంగాణ నేతలు సీమాంద్ర నేతలకు పిలుపునిచ్చారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles