Telugu comedian dharmavarapu subramanyam passed away

Dharmavarapu Subramanyam passed away, Telugu comedian Dharmavarapu Subramanyam, Telugu film actor comedian, Dharmavarapu Subramanyam died, Comedian Dharmavarapu Subramanyam

Telugu comedian Dharmavarapu Subramanyam passed away, Telugu film actor comedian, Dharmavarapu Subramanyam died, Comedian Dharmavarapu Subramanyam

‘ఆనందో బ్రహ్మా ’ అనంత లోకాలకు

Posted: 12/08/2013 01:11 PM IST
Telugu comedian dharmavarapu subramanyam passed away

టాలీవుడ్ ఇండస్ట్రీ మరో హాస్య నటుడ్ని కోల్పోయింది. ఇటీవలే ఏవీఎస్ మరణం మరచిపోక ముందే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో  ‘ఆనందో బ్రహ్మా ’ అంటూ చెరగని ముద్రవేసిన ‘ధర్మవరపు సుబ్రహ్మణ్యం ’ కేన్సర్ వ్యాధితో బాధ పడుతూ హఠాన్మరణం చెందారు. గత రెండు దశాబ్దాలకు పైగా తెలుగు ప్రేక్షకులన్ని అలరిస్తూ, శాశ్వత స్థానం సంపాదించుకున్న ధర్మవరపు (53) హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ లోని ఆయన స్వగ్రుహంలో శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు.

ధర్మవరపుది ప్రకాశం జిల్లాలోని కొమ్మినేనివారి పాలెం స్వగ్రామం. గత ఏడాదిగా ఆయన లంగ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన పార్థీవదేహాన్ని నేడు సందర్శనార్థం ఉంచి , తరువాత ప్రకాశం జిల్లాలోని సింగరకొండలో ఉన్న ఫామ్ హౌజ్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జంధ్యాల  సినిమా ‘జయమ్ము నిశ్చయమ్మురా ’తో వెండితెర  పరిచయం  అయిన ధర్మవరపు జంధ్యాల బలవంతం మేరకు (1989) రంగనాథం పాత్ర చేశారు.

తరువాత చిన్న చిన్నగా ఎదుగుతూ...ధర్మవరపు తన కెరీర్‌లో ఎంతో ఎత్తుకు ఎదిగాడు. అవకాశాల కోసం ఎన్నడూ వెనుతిరిగి చూడాల్సిన అవసరం కూడా రాలేదు. తోటి హాస్యనటులకు దీటుగా తనదైన మార్కు హాస్యంతో పరిశ్రమలో నిలబడ్డారు. ఎక్కడా అతి లేకుండా, పరిధులు దాటకుండా, అశ్లీలతకు దూరంగానే హాస్యాన్ని పండించారు. వాచకంలో స్పష్టత, తెలుగుదనం ఉట్టిపడడం ఆయనలోని ప్రత్యేకత.

ఆయన డైలాగ్ మాడ్యులేషన్, ఆయనకంటూ ఓ శైలిని సృష్టించిపెట్టింది. వెండితెరనే కాకుండా, బుల్లి తెర పై కూడా అలరించిన ఆనందో బ్రహ్మా అకాల మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటుగా చెప్పవచ్చు. ఈయన మరణం పట్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles