రాబోయే ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ఫలితాలలో అధికార కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం అంచున ప్రయణిస్తుంది. నేడు నాలుగు రాష్ట్రాల ఫలితాల లెక్కింపు జరుగుతుంది. నాలుగు రాష్ట్రాల్లో కమలం పార్టీ బీజేపీ ఆధిక్యంలో దూసుకొని పొతుంది.
ముఖ్యంగా ఢిల్లీకి సుదీర్ఘ కాలంగా ముఖ్యమంత్రిగా ఉన్న షీలా దీక్షిత్ ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ క్రేజ్రీవాల్ చేతిలో 8వేల ఓట్లతో పరాజయం పాలైంది. గత పదిహేను సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న పనిచేస్తున్న ఢీల్లీలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవలే స్థాపించిన కొత్త పార్టీ అభ్యర్థి చేతిలో ఆమె ఓడిపోవడం గమనార్హం. షీలా పై పోటీ చేసి గెలుస్తానన్న అరవింద్ క్రేజ్రీవాల్ అనుకున్నది సాధించి రికార్డు స్రుష్టించారు. షీలా దీక్షిత్ తన రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కి అందచేశారు.
ప్రస్తుత ఫలితాలను బట్టి 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో కాంగ్రెస్ పది స్థానాల్లో కూడా గెలిచే పరిస్తితి కనిపించడం లేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తగినన్ని స్థానాలు సంపాదించడంతో అన్నా హజారే సంతోషం వ్యక్తం చేశారు. ఏదో ఒకరోజు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాలకు ఢిల్లీ కేంద్ర స్థానమని, ఏకంగా 15 ఏళ్లపాటు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కేవలం చీపురు కట్ట పట్టుకుని ఓడించడం అంత సులభమైన పని కాదని హజారే వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తల బలంతో ఏదో ఒకరోజు కేజ్రీవాల్ తప్పక ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతారని అన్నా హజారే విశ్వాసం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more