South african anti apartheid hero nelson mandela died

Anti-apartheid hero Nelson Mandela died, South African anti-apartheid hero,Nelson Rolihlahla Mandela,Nelson Mandela,African National Congress,Nobel Peace Prize,economy,David Cameron,Barack Obama,Ban Ki-Moon,Africa

South African anti-apartheid hero Nelson Mandela died aged 95 at his Johannesburg home on Thursday after a prolonged lung infection.

అస్తమించిన దక్షిణాఫ్రికా నల్ల సూరీడు

Posted: 12/06/2013 09:03 AM IST
South african anti apartheid hero nelson mandela died

దక్షిణాఫ్రికా నల్ల సూరీడు, తెల్లవారి గుండెల్లో ప్రచండాగ్నులు రగిలించిన దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా (95) జోహన్నస్ బర్గ్ లోని ఆయన  స్వగృహంలో నిన్న రాత్రి 8.50 గంటలకు కన్నుమూశారు. ఈయన మరణాన్ని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా ప్రకటించారు.

1918 జూలై 18న జన్మించిన, విద్యార్ధి దశలోనే వర్ణవివక్ష వ్యతిరేక పోరాటాలకు ఆకర్షితుడై తన జాతి విముక్తి కోసం ఎనలేని పోరాటం, జాతి వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించి, రాబెన్ దీవిలో 27 సంవత్సరాల సుదీర్ఘ కారాగార వాసం అనుభవించిన తర్వాత, ఆ దేశానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తొలి అధ్యక్షుడిగా నిలిచారు. ఆయనకు 1993లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. 2001 లో మండేలాకు గాంధీ అంతర్జాతీయ పురస్కారం లభించింది.

1994-99 వరకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. సుమారు 25కి పైగా అవార్డులు అందుకున్నాడు. దేశం గొప్ప నాయకున్ని కోల్పోయిందని పేర్కొన్నారు. దేశ ప్రజలు జాతిపితను పోగొట్టుకున్నారని వ్యాఖ్యానించారు. నెల్సన్ మండేలాకు ఆరుగురు సంతానం ఆయన మూడు సార్లు వివాహం చేసుకున్నాడు. జాతీయ పతాకాన్ని సగం అవనతం చేయాలని జుమా ఆదేశించారని బీబీసీ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles