Political leaders response on telangana final decision

T.Political Leaders Response on Telangana final decision, Telangna final decision, Jana reddy, Hareesh rao, kishan reddy, trs party, bjp party, t.congress leaders

T.Political Leaders Response on Telangana final decision, Telangna final decision, Jana reddy, Hareesh rao, kishan reddy, trs party, bjp party, t.congress leaders

తెలంగాణ తీర్పు పై ఎవరేమన్నారంటే..

Posted: 12/05/2013 10:31 PM IST
Political leaders response on telangana final decision

షిండే ప్రకటనతో తెలంగాణలో సంబరాలు మిన్నంటాయి. కేంద్రం నిర్ణయం పై తెలంగాణ ప్రాంత నాయకుడు జానారెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనేక అపోహలకు, అనుమానాలకూ గురవుతూ, తెలంగాణ సాధనకు అందరం కృషి చేస్తూ వచ్చామని, కొంత మంది కేవలం రాజకీయ లబ్ది కోసం కుట్రలూ కుతంత్రాలూ చేశారని, అయినా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, కేబినెట్ అందరూ తెలంగాణ కల సాకారం చేశారని ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మాట నిలబెట్టుకున్నారని, ఇక కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అభినందించ తెలపవలసి ఉందని ఆయన విజ్ఞప్తి చేశారు.

టీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు మాట్లాడుతూ... కేసీఆర్ 13 ఏళ్ల కృషి ఫలితంగా కేంద్రం పది జిల్లాల తెలంగాణాను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించిందని, అమరుల త్యాగ ఫలితం ఈ తెలంగాణ ప్రకటన అని ఆయన చెప్పారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్రం ప్రకటన పై హర్షం వ్యక్తం చేస్తూ.... తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని తమ పార్టీని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకుందని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణ బిల్లు ఆమోదం వెనుక  బీజేపీ నేతలు ఎల్.కె.అద్వానీ,రాజనాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ ల చొరవ వెలకట్టలేనిదిగా కిషన్ రెడ్డి అభివర్ణించారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ పోరాటమే కారణమన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles