Ysrcp and tdp call for bandh in seemandhra

YSRCP and TDP Call for Bandh in Seemandhra, APNGOs Call for Bandh in Seemandhra, Bandh in Seemandhra, YSRCP , TDP, 48 hour bandh, YSR Congress Party, ap bifurcation, telangana issue, congress party, 2014 election,

YSRCP and TDP Call for Bandh in Seemandhra, APNGOs Call for Bandh in Seemandhra, Bandh in Seemandhra

బంద్ కు పిలుపునిచ్చిన రెండు పార్టీలు ?

Posted: 12/06/2013 10:44 AM IST
Ysrcp and tdp call for bandh in seemandhra

రెండు లోకల్ పార్టీలు బంద్ కు పిలుపునిచ్చాయి. రాష్ట్ర విభజనను కేంద్ర కేబినెట్‌ ఆమోదించటాన్ని నిరసిస్తూ తెలుగుదేశం, వైకాపా, ఉద్యోగ, ప్రజాసంఘాలు, ఏపి ఎన్జీవోలు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఈరోజు సీమాంధ్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. సీమాంధ్ర తెలుగుదేశం శుక్ర, శని వారాల బంద్‌కు పిలుపు నిచ్చింది. ఏపీఎన్జీవోలు, వైకాపా ఒక్కరోజే బంద్‌ను నిర్వహించాలని నిర్ణయించాయి. మొత్తానికి కేబినెట్‌ తెలంగాణ నిర్ణయంతో సీమాంధ్రలో నిరసన సెగలు మొదలయ్యాయి.

 

సీమాంధ్రతో పాటు తెలంగాణ ప్రాంతంలోని సమైక్య వాదులంతా బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశాయి. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులంతా బంద్‌ పాటించాలని సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు విజ్ఞప్తి చేశారు. బంద్‌లో సమైక్యవాదులంతా భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్‌ వి.లక్ష్మణరెడ్డి కోరారు.

 

సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామాచేసి యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. బంద్‌కు విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకులు సహకరించాలని కోరారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles