Payyavula keshav fire on congress leaders

payyavula keshav fire on congress leaders, Payyavula Keshav Fire On Congress, telugu desam party, sonia ghat, telangana congress leaders fire on tdp, chandrababu naidu, sonia gandhi, ys rajasekhara reddy, ysrcp, ys jagan ,

payyavula keshav fire on congress leaders, Payyavula Keshav Fire On Congress

ప్రతి పల్లెలో సోనియా ఘాట్ లు : టిడిపి

Posted: 10/17/2013 01:04 PM IST
Payyavula keshav fire on congress leaders

చిత్తూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తెలిపిన నిరసనపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నుండి తీవ్రస్తాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒకడుగు ముందుకేసి.. మీరు చంద్రబాబుకు సమాధి కట్టుకొండని సలహ ఇవ్వటం జరిగింది. మరో నాయకుడు కేసులు పెట్టాలని డిమాండ్ చేయటం జరిగింది. ఇలాంటి సమయంలో టిడిపి నాయకులు కూడు మాటల యుద్దానికి దిగటం జరిగింది.

 

తెలంగాణ విద్యార్థుల జీవితాలకు సమాధులు కడితే నోరు మెదపరు, సోనియా చిత్రపటానికి సమాధులు కడుతుంటే కేంద్ర మంత్రులు గగ్గోలు పెడుతున్నారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో సోనియా చిత్రపటాలకు సమాధులు కడతామని కేశ్ వ్ వెల్లడించారు. సత్తా ఉంటే అసెంబ్లీకి తెలంగాణ బిల్లు పంపాలని సవాల్ చేశారు. తమది రాగిముద్దల కోసం పోరాటం...కేసీఆర్‌ది బిర్యానీ కోసం ఆరాటం అని పయ్యావులు ఎద్దేవా చేశారు.

 

అయిన రాజకీయ నాయకులకు రాగిముద్దలు, బిర్యానీల పై ఉన్న అభిమానం ఏమిటో ఇప్పుడే బయటపడింది. ప్రజా సమస్యలను గాలికొదిలేసి.. సోనియా సమాధులు కట్టుకోంటే ఏం వస్తుంది చెప్పంటి? కొన్ని గ్రామల్లో అసలే సశ్మానం స్థలం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి గ్రామాల్లో సోనియా సమాధులు ఎలా కడతారు. అంతేకాకుండా.. రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలతో ఖాళీ స్థలం లేకుండా పోయింది. ఇక సోనియ గాంధీ సమాధులు ఎక్కడ కడతారు. తెలంగాణ కోసం 1200 విద్యార్థులు బలి దానం అయ్యారు. అప్పుడు మాట్లాడని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు సోనియా ఘాట్ పై స్పందించటం అనేది కూడా ఆలోచించాలి. అంటే తెలంగాణ ప్రజల కంటే.. సోనియాగాంధీకే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు విలువ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. ఏమైన రాజకీయ నాయకులు ప్రజలకు ఉపయోగపడే వాటి ద్రుష్టిపెడితే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles