Geetha reddy summoned by cbi court

Andhra Minister for Major Industries, J. Geetha Reddy, CBI investigation, Lepakshi Knowledge Hub, quid pro quo investments scam,India,Andhra Pradesh

Minister for Major Industries J. Geetha Reddy, three IAS officers, and 10 others were summoned by the Principal Special Court for CBI Cases here on Thursday to appear before it on November 15

తెర పైకి గీతారెడ్డి రాజీనామా?

Posted: 10/18/2013 08:00 AM IST
Geetha reddy summoned by cbi court

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల వ్యవహారం ఇంకా మంత్రులను వెంటాడుతూనే ఉంది. పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించి బెయిల్ పై ఆయన, అనుచర గణం మొత్తం విడుదలయినా కానీ అప్పటి మంత్రులను మాత్రం సీబీబీ వదలడంలేదు. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌పై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకోవడంతో.. మంత్రి గీతారెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. నవంబర్ 15న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో పాటు, మాజీ మంత్రి ధర్మానకు కూడా కోర్టు సమన్లు ఇచ్చింది. ఇదే వ్యవహారంలో విజయసాయి రెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డి, బాలాజీలకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. 2004-09లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన  గీతారెడ్డిని  ఏ-9గా  సిబిఐ ఛార్జిషీట్లో  పేర్కొని సమన్లు జారీ చేయడంతో మరోసారి ఆమె రాజీనామా వ్యవహారం తెర పైకి వచ్చింది.

నిజానికి  సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసిన రోజే .. ఆమె క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్‌ను కలిసి తాను రాజీనామా చేస్తానని చెప్పారు. అయితే.. అప్పుడే తొందర పడవద్దంటూ సీఎం ఆమెను బుజ్జగించారు. ఇప్పుడు సమన్లు జారీ చేసి, కోర్టు బోను ఎక్కాలని చెప్పడంతో గీతారెడ్డి రాజీనామా చేస్తారనే వార్తలు మళ్ళీ ఊపందుకున్నాయి. మరి ఈమె రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి ఆమోదిస్తారో ? లేక బుజ్జగిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles