Ysr congress samaikya shankaram october 28th

ysr congress samaikya shankaram october 28th, Samaikya Sankaravam, YSR congress party, K Shivakumar, Hyderabad, Oct 28

ysr congress samaikya shankaram october 28th, Samaikya Sankaravam, YSR congress party, K Shivakumar, Hyderabad, Oct 28

శంఖారావం మోగేది 28న

Posted: 10/17/2013 08:03 AM IST
Ysr congress samaikya shankaram october 28th

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈనెల 19వ తేదీన సమైక్యాంధ్రకు మద్దతుగా హైదరాబాద్ లో తలపెట్టిన సమైఖ్య శంఖారావం సభ వాయిదా పడింది. ఈ సభ కోసం ప్రభుత్వం నుండి అనుమతి రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించగా సభను నిర్వహించుకోవచ్చని తెలిపింది. అయితే ఈ అనుమతి వచ్చేనాటికి సభ నిర్వహణకు చాలా తక్కువ సమయం ఉండంటంతో దీనిని 19 వ తేదీన కాకుండా, ఈ నెల 28వ తేదీన నిర్వహించాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మొదట ఎల్బీ స్టేడియంలో నిర్వహించాలని అనుకున్నా, ఇప్పుడు వాయిదా పడటంతో 28వ తేదీన నిర్వహించే సభా వేధికను మాత్రం ఇంకా వెల్లడించలేదు. కోర్టు తీర్పును ఆ పార్టీ నేత ఎంవీ మైసూరారెడ్డి స్వాగతించారు. న్యాయం గెలిచినందుకు సంతోషంగా ఉందన్నారు. హింసించి ఆనందించే స్వభావం ఉన్న ప్రభుత్వ పర్యవేక్షణలో పోలీసులు వ్యవహరిస్తుండడం దురదృష్టకరమని మైసూరా వ్యాఖ్యానించారు.. ఆ మేరకు సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాల్సిందిగా పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు కె.శివకుమార్ బుధవారం నగర డీసీపీ కమలాసన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles