Samaikya affect to pawan kalyan movie

Samaikya Affect To Pawan Kalyan Movie, Attarintiki Daredi Movie,Samaikya Protest Stoped Pawan Kalyan Attarintiki Daredi Movie in Vizag, Samaikya Affect in warangal

Samaikya Affect To Pawan Kalyan Movie, Attarintiki Daredi Movie,Samaikya Protest Stoped Pawan Kalyan Attarintiki Daredi Movie in Vizag, Samaikya Affect in warangal

రెండు చోట్లా అత్తారింటికి సెగ తగిలింది

Posted: 09/27/2013 06:38 PM IST
Samaikya affect to pawan kalyan movie

గత కొన్ని రోజుల నుండి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వాయిదాల మీద వాయిదాలు పడి, చివరికి పైరసీకి గురైన పవన్ కళ్యాణ్ సినిమాను దర్శక నిర్మాతలు తప్పనిసరి పరిస్థితుల్లో నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నేడు విడుదల అయిన ఈ సినిమాకు ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర ప్రాంతాలలో ఉద్యమ సెగ తగిలింది. ఈ సినిమాకు విడుదలకు ముందే ఓయూ జేఏసీ , సీమాంధ్ర విద్యార్థి జేఏసీ మెగా ఫ్యామిలీ సినిమాలను అడ్డుకుంటామని హెచ్చకరికలు జారి చేసిన విషయం విధితమే. వారు అన్నట్లు గానే నేడు ఈ సినిమాను పలు ప్రాంతాల్లో అడ్డుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో తెలంగాణ వాదులు పవన్ కళ్యాణ్ సినిమా పోస్టర్లను తగలబెట్టి నిరసన తెలిపారు. హన్మకొండలోని ఏషియన్ మాల్ దగ్గర ఈ సినిమాను సంబంధించిన ప్రింట్లను తగలబెట్టడంతో కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నంలోని తగరపువలస గణేష్ థియేటర్ దగ్గర సినిమాను నిలిపివేయాలని సమైక్యవాదులు నినాదాలు చేశారు. మొత్తానికి ఇరు ప్రాంతాలకు చెందిన ఉద్యమకారులు ‘అత్తారింటికి ’ సెగ తగిలించారు. అయితే సినిమా టాక్ బాగుందని రావడంతో ఈ ఎఫెక్టు సినిమా కలెక్షన్ల పై పడదని కొందరు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles