Ap rejects dgp dinesh reddy extension plea

DGP V. Dinesh Reddy, Central Administrative Tribunal, Andhra DGP, Dinesh Reddy,Andhra Pradesh,Hyderabad

Government says no to extension of Dinesh Reddy's tenure as DGP.

బాసూ... ఇక మీరు వెళ్ళవచ్చు

Posted: 09/27/2013 08:54 PM IST
Ap rejects dgp dinesh reddy extension plea

మన రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ దినేష్ రెడ్డి తన పదవికాలాన్ని మరో రెండేళ్ళు పొడిగించుకోవడానికి  ఎన్నో ప్రయత్నాలు, పడరాని పాట్లు, పిటీషన్ల మీద పిటీషన్లు వేసినా చివరకు అవన్నీ బెడిసి కొట్టడంతో ఆయనకు చివరి ఆప్షన్ గా మిగిలింది ఒక్క పదవి విరమణ మాత్రమే. తన పదవి కాలాన్ని పొడిగించలేమన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మళ్లీ క్యాట్‌లో డీజీపీ వేసిన పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిపిన క్యాట్ పిటిషన్‌ను కొట్టివేసింది. డీజీపీ పదవి కాలాన్ని పొడిగించలేమని పేర్కొంది. ఈనెల 30వ తేదీన ఈయన పదవీ కాలం ముగియనుంది. దీంతో ఆయనకు ప్రభుత్వం పదవీ విరమణకు ఉత్తర్వులు కూడా జారీ చేయడంతో మరో మూడు రోజుల్లో ఈయన మాజీ డీజీపీగా మారబోతున్నారు. ఈయన పదవి అధిష్టినప్పటి నుండి ఈయన కన్నా సీనియర్లు ఈయన పై ఏదో ఆరోపణ చేస్తూనే ఉన్నారు. దానికి ప్రభుత్వం నుండి సపోర్టు ఉండటంతో ఇన్నిరోజులు పదవిలో కొనసాగారు. సీనియర్ల నుండి విమర్శలే కాకుండా మొన్నటి మొన్న అక్రమాస్తులు ఉన్నాయంటూ సీబీఐ విచారణ కూడా జరుపుతుంది. పోతూ పోతూ ఉంటే పోలీస్ బాస్ కు అన్నీ కష్టాలే చుట్టు ముట్టాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles