Rahul gandhi against govt ordinance

rahul gandhi against Govt ordinance, Govt ordinance criminal representatives, Ordinance protecting leaders crime record, AICC Vice President Rahul Gandhi

rahul gandhi against Govt ordinance

ఆ ఆర్డినెన్స్ తప్పు, నేనొప్పుకోనన్న రాహుల్

Posted: 09/27/2013 02:51 PM IST
Rahul gandhi against govt ordinance

నేరస్తులు ప్రజాప్రతినిధులుగా ఉండవచ్చని భారత ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ తప్పని సాక్షాత్తూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దాన్ని తప్పు పట్టారు.  మరి ఎవరి ప్రమేయంతో ఆ ఆర్డినెన్స్ పాసయినట్లు. 

అంతేకాదు, ఢిల్లీ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో, రాజకీయ పార్టీలన్నీ కలిసి దాన్ని అడ్డుకోవాలని కూడా రాహుల్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.  అయితే అది తన వ్యక్తిగత అభిప్రాయమే సుమా అని స్పష్టం చేసారు.  అవినీతిని అడ్డుకోవాలనే చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి ఆర్డినెన్స్ లను ప్రభుత్వం పాస్ చెయ్యగూడదని ఆయన అన్నారు. 

రాహుల్ తన ఉద్దేశ్యంలో నేరచరిత కలవాళ్ళ మీద అనర్హత వేటు పడవలసిందే నన్న అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పటానికి ముందుగా ఓటర్లు ప్రజాప్రతినిధులను తిరస్కరిస్తూ ఓటు వెయ్యవచ్చని సుప్రీం కోర్టు సంచలనాత్మకమైన తీర్పు నివ్వటం విశేషం. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles