T cabinet note to be ready by first week of october

ELANGANA CABINET NOTE, October first week, Kiran Kumar Reddy,Digvijay Singh,Andhra Pradesh,T cabinet note

AICC general secretary in charge of Andhra Pradesh Digvijaya Singh said on Thursday that the cabinet note on Telangana would be ready by the first week of October.

వచ్చే వారంలోనే తెలంగాణ నోట్

Posted: 09/27/2013 08:40 AM IST
T cabinet note to be ready by first week of october

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జీ దిగ్విజయ్ సింగ్ దూకుడు చూస్తుంటే అధిష్టానం ఛాన్సిస్తే రాత్రికి రాత్రే తెలంగాణ ఏర్పాటు చేసేలా వ్యవహరిస్తున్నాడు. మొన్నటి వరకు ఆంటోని కమిటీ నివేదిక వచ్చే వరకు తెలంగాణ నోట్ రాదని చెప్పిన డిగ్గీరాజా ఇప్పుడు మాత్రం ఇన్ని రోజులకు భిన్నంగా  తెలంగాణపై తీసుకున్న నిర్ణయానికి గట్టిగా కట్టుబడి ఉన్నామని, అక్టోబర్ మొదటి వారంలోనే మంత్రివర్గం ముందుకు కేబినెట్ నోట్ వస్తుందని ప్రకటించారు. అన్ని రాజకీయ పార్టీలతో, సమాజంలోని అన్ని వర్గాలతో అవసరమైనన్ని సంప్రదింపులు జరిపిన తర్వాతే విభజనపై నిర్ణయం తీసుకున్నామని, రాజీకీయ పార్టీలు అయిన టీడీపీ, బీజేపీ, వైసీపీ సహా అన్ని పార్టీలు  ఏకాభిప్రాయానికి వచ్చాకే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రవిభజనపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటి నిర్ణయం తీసుకుందని.. నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న హైదరాబాద్, సాగునీరు మొదలైన అంశాలపై ఆంటోనీ కమిటీ తగిన పరిష్కారాలను సూచిస్తుందని చెప్పారు. మరి కాంగ్రెస్ హై కమాండ్ ఈ కొత్త రాగం అందుకోవడం వెనక ఆంత్యర్యం ఏమిటో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles