Jagan bail match fixing chandrababu angers

jagan bail match fixing, YS Jagan bail angers Chandrababu, Congress and YSRC, match fixing

jagan bail match fixing, YS Jagan bail angers Chandrababu

చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్ ?

Posted: 09/23/2013 07:14 PM IST
Jagan bail match fixing chandrababu angers

జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ విషయంలో కాంగ్రెస్, వైకాపాలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సిబిఐ కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ సంస్థగా మారిందని ఆయన అన్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ ఒక్క అంశాన్ని విచారణ జరపలేదన్నారు. ఈ కేసులో జగన్ కుబెయిల్ కోసమే సిబిఐ తన న్యాయవాదులను సరిగ్గా పెట్టుకోలేదని ఆయన వెల్లడించారు. తెలంగాణలో తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేసుకుంటోందని ఆయన చెప్పారు. సీమాంద్రలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు వైకాపాను కాంగ్రెస్ పూరమాయించిందని బాబు ఆరోపించారు.

జగన్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని అక్రమ కలయికను ప్రజల ద్రుష్టికి తీసుకువెళుతామని చంద్రబాబు ఆవేశంగా అన్నారు. ఈ రెండు రాజకీయ పక్షాలను ప్రజాన్యాయస్థానంలో దోషులుగా నిలబెడుతామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై జాతీయసమగ్రతామండలిసమావేశంలోచెప్పేందుకు యత్నిస్తే తనను కేంద్రహోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను అడ్డుకున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు కాంగ్రెస్సే కారణమని ఆయన విమర్శించారు. జగన్ అక్రమాస్తుల కేసులో సిబీఐ హడావుడిగా దర్యాప్తు పూర్తి చేసిందనన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles