Ready to quit minister post for tg venkatesh

ready to quit minister post for tg venkatesh, Tg Venkatesh, minister Tg Venkatesh, congress party, samaikyandhra movement, chandrababu naidu, tg fire on chandrababu naidu

ready to quit minister post for tg venkatesh, tg fire on chandrababu naidu

మంత్రి టీజీలో రగిలిన రాజీనామా చలనం

Posted: 09/19/2013 04:37 PM IST
Ready to quit minister post for tg venkatesh

మూతి మీద మీసాలను తిప్పుతూ సవాల్ చేసిన మంత్రి టీజీ వెంకటేష్ లో ఎట్టకేలకు చలనం కలిగింది. సొంత జిల్లాలోనే టీజీకి సమైక్యావాదులు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. సీమాంధ్రలో ఉద్యమం తీవ్రతరం కావడానికి చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడమే కారణమని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును వ్యతిరేకించేందుకే తాము రాజీనామాలు చేయలేదని తెలిపారు. అవసరమైతే సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేసేందుకు సిద్ధమని చెప్పారు. ముందుగా రాజీనామాను ఆమోదింపచేసుకునేది తానేనని అన్నారు. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఓట్లు, సీట్లు కోసం ప్రాంతాలకు అనుకూలంగా మాట్లాడాయని మంత్రి టీజీ వెంకటేష్ అంతకుముందు అన్నారు. సమైక్యాంధ్ర జేఏసీనే అధిష్టానంగా భావిస్తున్నామని చెప్పారు. అన్ని పార్టీల అధినేతలు ద్వితీయ శ్రేణి నేతలను నిలువునా ముంచారని పేర్కొన్నారు. సీమాంధ్రలో ప్రభుత్వ ఉద్యోగులు జీతాల్లేకుండా చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చొద్దని కోరారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles