Save andhra pradesh meet in vijayawada

Save Andhra Pradesh,Cultural activities,Cabinet meeting, Telangana issue, Vijayawada Corporation, Andhra bifurcation, Samaikyandhra agitation,Andhra Pradesh,Vijayawada,politics

Save Andhra Pradesh meet in Vijayawada today.

నేడు విజయవాడలో భారీ బహిరంగ సభ

Posted: 09/20/2013 09:01 AM IST
Save andhra pradesh meet in vijayawada

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్రులు గత 52 రోజులుగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు నేడు బెజవాడ కనకదుర్గ సాక్షిగా ‘సేవ్ ఆంధ్రప్రదేశ్ ’ సభకు శ్రీకారం చుట్టారు. ఈనెల 7వ తేదీన హైదరాబాద్ లో ఏపీ ఎన్జీఓలు భారీ బహిరంగ సభను నిర్వహించి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అదే ఉత్సాహంతో హైదరాబాద్ సభను తలదన్నేలా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి సభను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ సభకు సమైక్యవాధులు భారీగా తరలి వస్తారని , దీని ద్వారా ఢిల్లీ పెద్దలకు తన పవర్ ఏంటో చూపించాలని భావిస్తున్నారు. హైదరాబాద్ సభకు ఉద్యోగులు మాత్రమే హాజరయ్యారు. ఈ సభకు ఉద్యోగులతోపాటు కార్మికులు, విద్యార్థులు, వివిధ జేఏసీలు, రైతులు, కూలీలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, వివిధ శాఖల సిబ్బంది, సాధారణ ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందుకు రక్షించుకోవాలి, విభజన జరిగితే ఎదురయ్యే సమస్యలు, నష్టాల గురించి వక్తలు సవివరంగా ప్రసంగిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles