Miniser panabaka lakshmi not willing to resign

miniser panabaka lakshmi not willing to resign, Seemandhra ministers, Samaikyandhra Protesters, Central Minister Panabaka Lakshmi, Panabaka faces Samaikyandhra heat, Petroleum Panabaka Lakshmi, Samaikyandhra Movement

miniser panabaka lakshmi not willing to resign, Panabaka faces Samaikyandhra heat

పనబాక లక్ష్మీలో కనిపించిన కాంగ్రెస్ పౌరుషం

Posted: 09/19/2013 12:35 PM IST
Miniser panabaka lakshmi not willing to resign

సీమాంద్రంలో ఉద్యమం అర్థసెంచరీ పూర్తి చేసుకుంది. సీమాంద్ర రాజకీయ నాయకుల్లో ఇప్పటికి చెలనం రాకపోవటవంతో.. సమైక్యవాదులు సీమాంద్ర రాజకీయ నాయకుల ఇంటిని ముట్టడించే పనిలో ఉన్నారు. అయితే ఈరోజు కేంద్ర మంత్రి పనభాక లక్ష్మీ ఇంటిని సమైక్యవాదులు ముట్టడించారు. వెంటనే మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు. అయితే తాను సమైక్యవాదినేనని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ స్పష్టం చేశారు. అయితే మంత్రి పదవికి మాత్రం రాజీనామా చేసే ప్రసక్తి లేదని ఆమె కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ పార్టీకి విధేయురాలినని, అలాగే ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పనబాక తెలిపారు. పనబాక లక్ష్మీ ఈరోజు సొంత నియోజకవర్గమైన బాపట్ల విచ్చేశారు. ఆమెను రైల్వే స్టేషన్ లో సమైక్యవాదులు అడ్డుకున్నారు. జై సమైక్యాంధ్ర అని అనాలని సమైక్యవాదులు పనబాకపై ఒత్తిడి తెచ్చిన....అందుకు ఆమె నిరాకరించారు. పోలీసుల భద్రత మధ్య పనబాక అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు బాపట్లలోని పనబాక నివాసం వద్ద పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. అయితే మంత్రి పనభాక లక్ష్మీ లో కాంగ్రెస్ పౌరుషం కనిపించిందని సీమాంద్ర ప్రజలు అంటున్నారు. సీమాంద్ర ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన కూర్చున్న పనబాక లక్ష్మీకి సమైక్యావాదం అంటే ఏమిటో చూపిస్తామని ఆమె నియోజక వర్గ ప్రజలు అంటున్నారు. అయిదు సంవత్సరాల పదవి కోసం తెలుగు ప్రజల ఆత్మగౌరవం పై దెబ్బకొట్టిందని సమైక్యవాదులు మండిపడుతున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles