Khairatabad ganesh shobha yatra starts

Khairatabad Ganesh Shobha Yatra starts 2AM, Ganesh immersion day, Khairatabad Ganesh immersion, Ganesh festival

Khairatabad Ganesh Shobha Yatra starts 2AM, Ganesh immersion day, Khairatabad Ganesh immersion, Ganesh festival

మరికాసేట్లో ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం

Posted: 09/19/2013 09:25 AM IST
Khairatabad ganesh shobha yatra starts

గత తొమ్మిది రోజుల నుండి భక్తి శ్రధ్దలతో పూజలు అందుకున్న గణనాధుడు నిమజ్జనానికి తరలి వెళ్లాడు. నిన్న రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా గణపతి నిమజ్జనం అంగరంగ వైభవంగా సాగింది.... సాగుతుంది. ఇక హైదరాబాద్ కే తలమానికమైన ఖైరతాబాద్ గణనాధుడి శోభ యాత్ర రాత్రి 2 గంటల తరువాత ప్రారంభం అయి ఇంకా కొనసాగుతుంది. ఈ శోభయాత్రను చూడటానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఖైరతాబాద్ లో వెలసిన 59 అడుగుల గోనాగ చతుర్ముఖ గణనాధుడి శోభయాత్ర ప్రస్తుతం తెలుగు తల్లి ఫై ఓవర్ వద్దకు చేరుకుంది. వేలాదిగా తరలి వచ్చిన భక్తుల జయజయ ధ్వానాల మధ్య ఈ యాత్ర కొనసాగుతుంది. మరో వైపు ట్యాంక్ బండ్ పై ఇంకా నిమజ్జనం కొనసాగుతుంది. భారీగా తరలి వచ్చిన గణనాధులు నిమజ్జనం కోసం వేచి ఉన్నాయి. ఇప్పటి వరకు 15 వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం అయ్యానని, ఇది పూర్తయ్యే వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని సీపీ అనురాగ్ శర్మ తెలిపారు. పాత బస్తి ప్రాంతాల్లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, ఎంజీ రోడ్డు నుండి వచ్చే వాహనాలను రాణింగ్ వద్ద దారి మళ్ళిస్తామని, ఇందిరాగాంధీ రోటరీ వైపు నుండి ఎన్టీఆర్ మార్గ్ వైపు రాకపోకలను నిషేదించినట్లు అనురాగ్ శర్మ తెలిపారు. నిన్న రాత్రి భక్తులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గణనాధులను నిమజ్జనం చేసి భక్తిని చాటుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles