Visalandhra activists attempted to siege chiranjeevi house

visalandhra activists attempted to siege chiranjeevi house, samaikyandra sega, amaikyandra activists attempted to siege chiranjeevi house, minister chiranjeevi,

visalandhra activists attempted to siege chiranjeevi house, samaikyandra activists attempted to siege chiranjeevi house

చిరంజీవి రాజీనామా పై విశాలాంద్ర ప్రతినిధులు..

Posted: 09/14/2013 12:24 PM IST
Visalandhra activists attempted to siege chiranjeevi house

కేంద్ర టూరిజం శాఖ మంత్రి చిరంజీవి రాజీనామా రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతుంది. అయితే చిరంజీవి మాత్రం తన రాజీనామా పై ఎలాంటి నిర్ణయం ఇప్పటి వరకు ప్రకటించలేదు. అందేకాకుండా హైదరాబాద్ ను యూటీ చెయ్యాలని సోనియా గాందీకి చెప్పిన మొదటి వ్యక్తిగా అందరికి తెలుసు. అయితే సమైక్యాంద్ర కోసం జరుగుతున్న ఉద్యమం పై ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్ కూడా చెయ్యలేదు. ఉద్యమానికి మద్దతు కూడా ప్రకటించలేదు. దీంతో సీమాంద్రలో మెగా కుటుంబం పై ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఉద్యమాం దెబ్బ మెగా కుటుంబ హీరోల సినిమాలపై పడిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు జూబ్లీహిల్స్ లోని చిరంజీవి ఇంటిని ముట్టడించేందుకు విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు ఈరోజు యత్నించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా చిరంజీవి రాజీనామా చేయాలంటూ విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు .... ఆయన ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళనకు తెలిపారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వాళ్లు చిరంజీవి ఇంట్లోకి దూసుకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అక్కడ నుంచి తరలించారు. అయితే ఒక్కసారిగా సమైక్యాంద్రకు మద్దతుగా భారీ ఎత్తున నినాదాలు చెయ్యటంతో.. చిరంజీవి కుటుంబం సభ్యులు ఆందోళన చెందినట్లు సమాచారం.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles