14 maoists killed in encounter in odisha

14 Maoists killed in encounter in Odisha, Fourteen Maoists were killed, encounter in Odisha, Odisha Malkangiri district, 14 Maoists in the Malkangiri district

14 Maoists killed in encounter in Odisha, Fourteen Maoists were killed

భారీ ఎన్ కౌంటర్, 14మంది నక్సల్స్ మృతి

Posted: 09/14/2013 12:39 PM IST
14 maoists killed in encounter in odisha

మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మల్కన్ గిరి జిల్లా కొడియా, కోరాపూట్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 14మంది మృతి చెందారు ఈ రోజు తెల్లవారుజాము నుంచి కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మల్కన్ గిరి జిల్లా ఎస్పీ అఖిలేశ్వర్ సింగ్ నేతృత్వంలో పోలీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఏవోబీ ప్రాంతంలో బాగా బలంగా ఉన్న మావోయిస్టులకు ఇదే అతి పెద్ద ఎదురుదెబ్బ. మావోయిస్టులు సమావేశం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఘటనా ప్రాంతం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. గత నెలలో కూడా ఒడిశాలో తొమ్మిదిమంది మావోయిస్టులు ఎన్ కౌంటర్ లో మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు నారాయణపూర్ లో ఓ మహిళా మావోయిస్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles