Kodandaram warned congress high command

Kodandaram Says Hyderabad Sirf Hamara,Kodandaram Warning To Congress, Kodandaram On CM Kiran Statements, Kodandaram On

Kodandaram Says Hyderabad Sirf Hamara,Kodandaram Warning To Congress, Kodandaram On CM Kiran Statements, Kodandaram On

హైదరాబాద్ ని కేంద్రం పాలితానికి ఒప్పుకోం

Posted: 09/14/2013 08:39 AM IST
Kodandaram warned congress high command

తెలంగాణ జేఏసీ ఛైర్మెన్ కోదండరామ్ మరోసారి తనదైన శైలిలో సమైక్యవాదులకు, కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ బిల్లును సాధ్యమైనంత తొందరగా పార్లమెంటులో పెట్టాలని, హైరదాబాద్ తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తామంటే ఒప్పుకునేది లేదని, తెలంగాణ ప్రజల చెమట చుక్కలతో, ప్రేమ పునాదుల మీద హైదరాబాద్ భాగ్యనగరమైందని, తెలంగాణ నుండి హైదరాబాద్ విడదీయాలని చూస్తే ఉద్యమకారులంతా జ్వాలాగ్నిగా ఎగిసిపడతారని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్‌ను తెలంగాణ నుండి విడదీయాలనుకుంటే శరీరం నుండి తలను వేరు చేయాలనుకోవడమేనని వ్యాఖ్యానించారు. యూటీ అంటే అంగీకరించడానికి తెలంగాణవాదులు సిద్ధంగా లేరని ఆయన స్పష్టం చేశారు. ఇటు తెలంగాణ వాదులు, అటు సమైక్యవాదులు హైదరాబాద్ ను వదలడం లేదు. ఈ సమస్య పరిష్కారం అయ్యేది ఎట్లో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles