Samaikyandhra activities attacked on minister ahmadullah

samaikyandhra activities, minister ahmadullah, samaikyandhra activities attacked on minister ahmadullah, Seemandhra Ministers,

samaikyandhra activities attacked on minister ahmadullah

మంత్రి పైకి సమైక్యాంద్ర చెప్పులు

Posted: 08/05/2013 01:53 PM IST
Samaikyandhra activities attacked on minister ahmadullah

సీమాంద్రలో ఉద్యమం తారస్థాయికి చేరింది. మంత్రి ఇళ్లపై సమైక్యాంద్ర వాదులు ముట్టించారు. అయితే ఈరోజు మంత్రి అహ్మదుల్లాకు కడప జిల్లాలో చేదు అనుభవం ఎదురయింది. కడపలో ఆయన పైకి సమైక్యవాదులు చెప్పులు విసిరారు. కలెక్టరేట్ వద్ద మంత్రి అహ్మదుల్లాను ఉపాద్యాయ సంఘాల నేతలు అడ్డుకున్నారు. అయితే మంత్రి పై చెప్పులు విసరడంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివ రావు ఇంటిని సమైక్యవాద మహిళలు చుట్టుముట్టారు. రాజీనామా చేయకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పదవుల కోసం సమైక్యవాదాన్ని మరిచిపోయారని వారు ఆరోపించారు. రాజీనామా చేయకుంటే ఆయనను తరిమి కొడతామన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles