Bjp rules out accepting hyderabad a ut

Bandaru Dattatreya,joint capital, UT or joint capital, Hyderabad, Telangana

BJP rules out accepting Hyderabad a UT.

ఉమ్మడి రాజధానికి మేం ఒప్పుకోం

Posted: 08/05/2013 02:35 PM IST
Bjp rules out accepting hyderabad a ut

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించిన బీజేపీ పార్టీ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేస్తే సహించేది లేదని, ఉమ్మడి రాజధానికి బీజేపీ పార్టీ వ్యతిరేకమని ఆ పార్టీ నేత, జాతీయ అధ్యక్షుడు అయిన బండారు దత్తాత్రేయ అన్నారు. ఆయన నేడు హైదరాబాద్ లో మాట్లాడుతూ... బీజేపీ తెలంగాణను సమర్దించింది కాబట్టే యూపీఏ ప్రభుత్వం తెలంగాణ పై నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. ఇక సీమాంధ్రలో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులకు కారణం ముఖ్యమంత్రి, పీసీసీ బొత్సలే కారణం అని, తెలంగాణ పై నిర్ణయం తీసుకునే ముందు వీరితో చర్చించారని, ఇప్పుడు ఆందోళనలు జరుగుతుంటే చేతులు ముడుచుకొని కూర్చున్నారని ఆయన ఆరోపించారు. ఉమ్మడి రాజధానిగా ఉండే పదేళ్ల కాలంలో హైదరాబాదు నగరం పోలీసు వ్యవస్థ, శాంతి భద్రతలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ వెల్లడించిన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో అమలు చేస్తున్న విధంగా హైదరాబాద్‌లోనూ శాంతి భద్రతలు, పోలీసు వ్యవస్థ బాధ్యతలను కేంద్ర హోం శాఖ నిర్వహించేలా చర్యలు తీసుకునే విషయం పరిశీలనలో ఉన్నదని ఓ వార్త ఛానల్ తో మాట్లాడుతూ అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles