Seemandhra leaders en mass resignations

Seemandhra leaders en mass resignations, TG Venkatesh, Katasani, JC Diwakar Reddy, Minister Sailajanadh, Shilpa Mohan Reddy, Seemandhra leaders meet

Seemandhra leaders en mass resignations

మూకుమ్మడి రాజీనామాల నిర్ణయం

Posted: 08/01/2013 03:02 PM IST
Seemandhra leaders en mass resignations

ఈరోజు హైద్రాబాద్ లో మంత్రుల నివాస ప్రాంగణంలో ఉదయం సమావేశమైన 14 మంది సీమాంధ్ర మంత్రులు, 23 మంది శాసన సభ్యులు, 10 మంది ఎమ్మెల్సీలు సీమాంధ్రలో చెలరేగుతున్న ఉద్యమ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకున్నారు. 

మూకుమ్మడిగా రాజీనామాలు చెయ్యాలని నిర్ణయించుకున్నట్లుగా టిజి వెంకటేష్ తెలియజేసారు.  ఉత్తుత్తి రాజీనామాలు కావని చెప్పటం కోసం అవి స్పీకర్ కి అందించవలసిన రాజీనామాల నమూనా ప్రతిలోనే ఉంటాయని కూడా స్పష్టం చేసారు. 

మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, తమ తమ జిల్లాలకు పోయి సమైక్యాంధ్ర కార్యాచరణ సమితి నాయకులను రాష్ట్రం పట్ల కేంద్రంలో జరిగిన పొరపాటు విషయంలో సంప్రదించి, సిడబ్లుసి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేట్లుగా ఒత్తిడి తీసుకునివస్తామని వాళ్ళకి చెప్తామని అన్నారు.  కర్నూలు, అనంతపురం జిల్లాలలో విగ్రహాలను ధ్వంసం చెయ్యటాన్ని ఆయన ఖండించారు. 

లోగడ కూడా రాజధానిని త్యాగం చేసిన ఆంధ్రులు మరోసారి హైద్రాబాద్ ని వదులుకోవటానికి సిద్ధంగా లేరని అన్న కాటసాని, తెలంగాణాకేమో ఏకంగా రాష్ట్రాన్నిచ్చారు, కోస్తాంధ్ర కేమో పోలవరాన్ని వరంగా ఇచ్చారు మరి మా సీమాంధ్ర మాటేమిటి అని ప్రశ్నించారు. 

శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ తక్షణ రాజీనామాలే తాము తీసుకోబోతున్న చర్య అని చెప్పారు.  సమైక్యరాష్ట్రం కోసం పదవులను త్యాగం చెయ్యటానికి నిర్ణయించుకున్నామని మంత్రి శైలజానాథ్ తెలియజేసారు.  రాష్ట్రాన్ని సమైక్యం ఉంచటమే ధ్యేయంగా సమావేశంలో పాల్గొన్న మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు నిర్ణయం చేసుకున్నారని ఆయన వెల్లడించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles