Sharmila padayatra in vijayanagaram

sharmila padayatra in vijayanagaram, ys sharmila maro praja prasthanam padayatra, ysr congress party, ysrcp, ys jagan, jagan-ysr, ys sharmila, ys vijayamma, rain fails to dither ys sharmila, ys rajasekhara reddy, ys sharmila is welcomed by the rain

sharmila padayatra in vijayanagaram

శభాష్ షర్మిల..

Posted: 07/11/2013 12:03 PM IST
Sharmila padayatra in vijayanagaram

రాజకీయ కోణంలో మాత్రం శభాష్ షర్మిల అని చెప్పటం లేదు. ఒక స్త్రీ మూర్తికి చెబుతున్న మాటలు. వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి, ఒక మహిళగా రాష్ట్రం మొత్తం పాదయాత్ర చెయ్యటం చాలా గొప్ప విషయమే. ఇలాంటి సాహాసం ఇప్పటి వరకు ఏ మహిళ చేసి ఉండదని మహిళలు అంటున్నారు. షర్మిల చేస్తున్న పాదయాత్ర రాజకీయమే అని చాలా అంటున్నారు. అది షర్మిల పాదయాత్ర, అన్న జగన్ కోసమో, తండ్రి ఆశయాల కోసమో, రాష్ట్రా ప్రజల పై అభిమానమో తెలియదుగానీ, ఒక తెలుగు మహిళ ఇంత గొప్ప సాహసం చెయ్యటం, మహిళ లోకానికే గర్వకారణం. అయిన షర్మిల ఏంసాధించిందని మీరు శభాష్అంటున్నారని, చాలామంది అనుకుంటున్నారు.

తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతివారికి ఒక తెలుగు సోదరి షర్మిల చేస్తున్న పాదయాత్రలోకి తొంగి చూస్తే, ప్రతి తెలుగింటి తోబుట్టువు కనిపిస్తుంది. ఆమె ఎందుకోసం చూస్తుందనే విషయం పక్కనపెట్టి, ఒక తెలుగింటి ఆడపడుచుగా షర్మిలను అభిమానించాని గుండే ఉండదని తెలుగు మహిళలు అంటున్నారు. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో రాస్తున్నామనుకుంటే పొరపాటే.. షర్మిల స్థానంలో మరో మన తెలుగు మహిళ ఉన్న అభిమానిస్తాం. మహిళలను గౌరవించే సంప్రదాయం మన తెలుగుదేవారిది. నిజంగా ఈరోజు షర్మిల చేసిన సాహసమే ఇందుకు నిదర్శనం, ప్రజలకు మేలు చేసే నాయకుడు ప్రజల మద్య నుండి వస్తాడనే పదాలు మనకు తరుచుగా, తెలుగు సినిమాల్లో వినిపిస్తుంటాయి. ఇప్పుడు షర్మిల విషయంలో అదే నిజమవుతుంది. షర్మిల భారీ వర్షంలో పాదయాత్ర 205వ రోజు విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలోని ఆలమండ నుంచి ప్రారంభమైంది. లొట్టపాలెం, ఏటపాలెం, కొత్తభీమసింగి, భీమసింగి మీదుగా షర్మిల యాత్ర చేశారు. ఈ సమయంలో భారీ వర్షం కురిసింది. ఆ వర్షంలో తడుస్తూనే షర్మిల నడక సాగించారు. వర్షంలో తడుస్తూ ముందుకుపోతున్న షర్మిలను చూసిన నారీలోకం గర్వంగా ఫీలైంది. తోటి మహిళ కార్యకర్తలు కూడా షర్మిలతోపాటే.. వర్షంలో తడుస్తూ పాదయాత్రలో సరికొత్త ఆనందం నింపినట్లు సమాచారం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh