Decision on minor in delhi gang rape

minor in delhi gang rape, juvenile Justice board, jsb principal magistrate, gitanjali goyal, nirbahaya case, gand rape in delhi,

decision on minor in delhi gang rape

నిర్భయ కేసులో మైనర్ మీద తీర్పు

Posted: 07/11/2013 02:43 PM IST
Decision on minor in delhi gang rape

ఢిల్లీలో బస్ లో వైద్య విద్యార్థిని మీద జరిగిన సామూహిక అత్యాచారంలో ఒక నిందితుడైన మైనర్ మీద శిక్ష వేయవచ్చునా లేదా అన్న విషయం మీద ఈరోజు జువెనైల్ జస్టిస్ బోర్డు నిర్ణయం తీసుకోవలసివుంది.  అయితే ఈ రోజు వాదోపవాదనలు విన్న తర్వాత బోర్డు తన నిర్ణయాన్ని ప్రకటించటానికి తారీఖును జూలై 25 కి వాయిదా వేసింది.

కదులుతున్న బస్ లో విద్యార్థినిని అతి దారుణంగా హింసించిన ఘటనలో ఒకడైన 17 సంవత్సరాల నిందితుడు మాత్రం మైనరన్న సాకుతో ఇంతకాలం శిక్షనుంచి తప్పించుకుంటూ వచ్చాడు కానీ దేశవ్యాప్తంగా జరిగిన సంచలనం మూలంగా జెఎస్ఎస్ కి ఈ కేసులో ప్రత్యేకంగా ఒక నిర్ణయం తీసుకోవలసిన అగత్యం ఏర్పడింది.  నిందితుడు పోయిన నెలలో మేజర్ అయ్యాడు.  ప్రిన్సిపల్ మాజిస్ట్రేట్ గీతాంజలి గోయల్ అధ్యక్షతన జెఎస్ బి లో మార్చిలో మొదలైన విచారణ ఈ నెల 5తో ముగిసింది. 

విచారణలో మైనర్ తను నిర్దోషని, తానా నేరంలో భాగం వహించలేదని చెప్తూ వచ్చాడు.  ఒకవేళ మైనర్ గా పరిగణించి చూస్తే గరిష్టంగా మూడు సంవత్సరాల శిక్షపడుతుంది.  అందులో ఇంతవరకు కస్టడీలో ఉన్న సమయాన్ని మినహాయించటం జరుగుతుంది.  పోయిన నెలలో 18 సంవత్సరాలు నిండటంతో, ఈ కేసు తీవ్రత దృష్ట్యా కూడా చూస్తే అతనికి మామూలు నిందితుడిలాగానే శిక్ష పడటం ఖాయమంటున్నారు ఒత్తిడి తెస్తున్నబాధితురాలి కుటుంబీకులు, ఇతర సమాజసేవకులు. 

గత సంవత్సరం డిసెంబర్ 16న జరిగిన ఈ దారుణకాండలో 23 సంవత్సరాల విద్యార్థిని బలైపోయింది.  దేశమంతా సంచలనాన్ని కలిగించిన ఈ అమానుష చర్యలో కఠినంగా శిక్షలు పడాలంటున్నారు కొన్ని సంఘాలవాళ్ళు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles