Madras high court warns actress anjali

Madras high court warns actress Anjali, Actress Anjali, Heroine Anjali, Madras High Court serious on Anjali, Anjali case, South Heroine Anjali, Anjali on July 9th, South Heroine Anjali Missing case,

Madras high court warns actress Anjali

నటి అంజలికి ఆగస్టు 12..?

Posted: 07/08/2013 01:10 PM IST
Madras high court warns actress anjali

సినీ నటి అంజలిపై సైదాపేట్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే నెల 12లోపు కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. లేనిచో అరెస్టు వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. అంజలి మిస్సింగ్ కేసును విచారణకు స్వీకరించిన సైదాపేట్ కోర్టు ఇప్పటికే మూడు సార్లు ఆమె గైర్హాజరవడాన్ని తీవ్రంగా పరిగణించింది. మరోవైపు రెండు నెలల కిత్రం అంజలి 'మిస్సింగ్' కు సంబంధించి మద్రాస్ హైకోర్టులో మరో కేసు నడుస్తోంది. గతంలోనూ అంజలి విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కాకపోవటంతో ఆమెకు కోర్టు మరోసారి అవకాశం ఇచ్చింది. తదుపరి తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. అంతే కాకుండా విచారణకు హాజరుకాని పక్షంలో అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని కూడా కోర్టు హెచ్చరించింది. అయినా అంజలి కోర్టు హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోలేదు. మళ్లీ కోర్టుకు డుమ్మా కొట్టింది.

ఇప్పటికే నాలుగు వాయిదాలు ఆ నాలుగు సార్లు అంజలి కోర్టుకు గైర్హాజరైంది. దాంతో తదుపరి విచారణకు కోర్టుకు హాజరు కాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు అంజలికి అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని పిటిషనర్ కలంజియమ్ కోర్టును కోరారు. మరోవైపు అంజలి తీరుపై ఇటీవలే మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 9లోగా కోర్టు ఎదుట హాజరు కావాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. నటి అంజలి కనిపించడం లేదని ఏప్రిల్ 8న ఆమె పిన్ని భారతి దేవీ మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్బస్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో స్పందించిన కోర్టు అంజలిని తమ ముందు హాజరుపర్చాలని చెన్నయ్ పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు కోర్టులకు డుమ్మాలు మీద డుమ్మాలు కొట్టడం చూస్తుంటే ఆమె అరెస్ట్ తప్పదనేలా కనిపిస్తోంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles